అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రజలు, ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ చరిత్రలోనే చూడలేదన్నారు. ఇజ్రాయెల్ చరిత్ర ఇదొక అతిపెద్ద రాజకీయ విపత్తు అని ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు అభివర్ణించాయి.సైన్యం తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ, ప్రజలు పూర్తిస్థాయి సహనం, ధైర్యాన్ని, ప్రదర్శించినప్పటికీ నెతన్యాహు నిర్ణయాల వల్లే ఇజ్రాయెల్ ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్దాయి.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుపై ఆ దేశ ప్రతిపక్ష నేత లాపిడ్ తీవ్ర విమర్శలు చేశారు. బెంజిమన్ నెతన్యాహు సొంత నిర్ణయాల వల్లే ఇజ్రాయెల్ గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ విపత్తు ఏర్పడింది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్దరాజకీయ వైఫల్యం అన్నారు. జాతి భద్రతకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కనీసం ప్రతిపక్షాలను సంప్రదించాల్సిన అవసరం ఉంది. మా ప్రమేయం లేకుండా భద్రతా నిర్ణయాలు జరిగిపోయాయి. ఇది పూర్తిగా నెతన్యాహు వైఫల్యమే అన్నారు లాపిడ్.
ALSO READ : పాకిస్తాన్ వేదికగా ఏప్రిల్ 10న ఇరాన్-అమెరికా చర్చలు
సైన్యం తమకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించింది. ప్రజలు అద్భుతమైన సహనాన్ని, పట్టుదల, ధైర్యాన్ని ప్రదర్శించారు.. అయితే రాజకీయంగా, వ్యూహాత్మకంగా నెతన్యాహు ఘోరంగా విఫలమయ్యారని ప్రతిపక్షాలు విమర్శించాయి. యుద్దం ప్రారంభంలో నెతన్యాహు పెట్టుకున్న ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా ఆయన చేరుకోలేకపోయారని మండిపడ్డాయి.
నెతన్యాహు అహంకారం, నిర్లక్ష్యం, ప్రణాళిక లేని నిర్ణయాల వల్ల ఇజ్రాయెల్ కు ఈ పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. నెతన్యాహు వల్ల జరిగిన రాజకీయ, వ్యూహాత్మక నష్టాన్ని సరిదిద్దుకోవాలంటే కొన్నేళ్లు పడుతుందని హెచ్చరించాయి ప్రతిపక్షాలు.
