
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన రీసెంట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ (War 2). కియారా అద్వానీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ తెరెకెక్కించాడు. ఆగస్టు 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజైన ఈ మూవీ రేపు (అక్టోబర్ 9న) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. చాలా రోజులుగా రూమర్ డేట్గా వినిపిస్తున్న అక్టోబర్ 9నే కన్ఫామ్ చేస్తూ అనౌన్స్ చేశారు మేకర్స్.
ఇవాళ (అక్టోబర్ 8న) నెట్‌ఫ్లిక్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. వార్ 2 హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ‘డబుల్ ర్యాంపేజ్ తో కోపాన్ని రెట్టింపు చేసుకోండి.. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’ అని ట్వీట్ చేస్తూ ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచింది.
Double the rage. Double the rampage. Ready for the War? 🔥#War2OnNetflix pic.twitter.com/ABUr3PMuiw
— Netflix India (@NetflixIndia) October 8, 2025
సౌత్ ఇండియాలో ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్, హిందీలో హృతిక్కు ఉన్న క్రేజ్.. ఈ సినిమాను ఏమాత్రం నిలబెట్టలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతోందని తమ ఫ్యాన్స్ ఆశించినప్పటికీ, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ప్రముఖ ట్రేడ్ నివేదికల ప్రకారం.. వార్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్ల గ్రాస్, రూ. 236.54 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందని సమాచారం.
కథ:
‘వార్ 2’ కథ కబీర్ (హృతిక్ రోషన్) అనే RAW ఏజెంట్‌తో మొదలవుతుంది. దేశాన్ని ప్రమాదం నుండి కాపాడటానికి చేసే ఒక మిషన్‌లో కబీర్ తన గురువు అయిన లూథ్రా (అశుతోష్ రాణా)ను చంపి, రా ఏజెన్సీ నుండి తప్పించుకుంటాడు. ఇలా ఒక కాంట్రాక్ట్ కిల్లర్గా మారి హత్యలు చేస్తూ ఉంటాడు.
ఈ క్రమంలో చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, రష్యా, శ్రీలంక వంటి దేశాలు కొన్ని చేరి ‘కలి’ పేరిట భారత్ పతనాన్ని చూడలాని ప్లాన్ చేస్తారు. ఇందుకు కబీర్ సరైన వాడు అని మెషిన్ అప్పగిస్తారు. కబీర్ చర్యలకు షాక్ అయిన RAW సంస్థ, అతడిని పట్టుకోవడానికి తమ కొత్త, అత్యంత సమర్థవంతమైన ఏజెంట్ అయిన విక్రమ్ (జూనియర్ ఎన్టీఆర్)ని రంగంలోకి దించుతుంది.
►ALSO READ | ఈ వారం పండగే: ఓటీటీలోకి తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీస్.. మైథికల్, యాక్షన్, హారర్ జోనర్లో
ఇక అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది? విక్రమ్, కబీర్ మధ్య సంబంధం ఏంటి? భారత్ ప్రధానికి ‘కలి’ వల్ల పొంచి ఉన్న ముప్పును ఎవరు ఆపారు? ఈ క్రమంలో వింగ్ కమాండర్ కావ్య లుత్ర (కియార అద్వానీ) పాత్ర ఏంటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే!!