ఓటీటీలోకి వరుణ్‌-లావణ్య పెళ్లి వీడియో .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వరుణ్‌-లావణ్య పెళ్లి వీడియో .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వరుణ్‌  తేజ్‌(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) మూడు ముళ్ల బంధంతో నవంబర్ 1న ఓ ఇంటివారయ్యారు. ఇటలీలోని టస్కానీ వేదికగా వీరి వివాహం ఘనంగా జరిగింది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. వరుణ్..లావణ్య పెళ్లి వీడియో ఓటీటీ లోకి రానుంది. మూడు రోజుల పాటు మెగా కుటుంబ సభ్యుల నడుమ జరిగిన  ఈ పెళ్లి వీడియోను చూడటానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. దీంతో వీరి పెళ్లి వేడుకను ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది 

ఈ మెగా మ్యారేజ్ వేడుక రైట్స్ను.. నెట్ఫ్లిక్స్ రూ.8 కోట్ల మేరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా, గతంలో కోలీవుడ్ కపుల్స్ నయన్‌-విఘ్నేశ్‌, హన్సిక-సోహైల్ వంటి ఫేమస్ సెలబ్రెటీస్ మ్యారేజ్ వేడుకలను..ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. 

ఇక త్వరలో వరుణ్..లావణ్య పెళ్లి వేడుక రాబోతుండగా..మెగా ఫ్యాన్స్ లో సంబరాలు షురూ అయ్యాయి. ఈ పెళ్లి వేడుకకు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌,అల్లు అర్జున్‌, సాయి ధరమ్, వైష్ణవ్, నితిన్ హాజరయ్యారు.