
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ ఉన్నప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్కు (Netflix)మాత్రం అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ‘నెట్‌ఫ్లిక్స్’కింగ్ అని చెప్పుకోవాలి. అంతేందుకు.. నెట్‌ఫ్లిక్స్ తర్వాతే మిగతా ఓటీటీస్ అన్నట్లుగా ఉంది. దీనికి కారణం లేకపోలేదు..నెట్‌ఫ్లిక్స్ ఎంచుకునే సినిమాల కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది.
అలాంటి గ్లోబల్ బ్రాండ్ సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. గురువారం (మే29) రాత్రి 9:40 గంటల సమయంలో ఒక్కసారిగా నెట్‌ఫ్లిక్స్ డౌన్ అయిపోవడంతో సబ్‌స్క్రైబర్స్ నుంచి 75,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి. అంతేకాదు "ఈ శీర్షిక తక్షణమే చూడటానికి అందుబాటులో లేదు. దయచేసి మరొక శీర్షికను ప్రయత్నించండి " అంటూ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఎర్రర్ చూపించింది. దాంతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయారు.
అవుట్‌టేజ్-ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం, మే 29 రాత్రి 9:40 గంటలకు 75,000 కంటే ఎక్కువ వినియోగదారు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది నెట్‌ఫ్లిక్స్ యూజర్స్ బేస్ యొక్క విస్తృత శ్రేణిని ప్రభావితం చేసే ప్రధాన సేవా అంతరాయాన్ని సూచిస్తుంది అని తెలిపింది. ఒక్కో యూజర్ ఒక్కో విధంగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
Netflix says its experiencing a "global outage". pic.twitter.com/HDboz0pwZH
— Scott McGrew (@ScottMcGrew) November 21, 2019
ప్రస్తుతం..నెట్‌ఫ్లిక్స్లో నాని హిట్ మూవీ, సూర్య రెట్రా మూవీ, సల్మాన్ ఖాన్ సికందర్, డిపార్ట్‌మెంట్ క్యూ ఎపిసోడ్ 5 స్ట్రీమ్ అవుతున్నాయి. వీకెండ్లో ఈ మూవీస్ చూడాలనుకున్న యూజర్స్కు అంతరాయం కలగడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ కంప్లెయింట్ చేస్తున్నారు.
Reasons for keeping Twitter/X? So I have someplace to check if Netflix is also down for everyone else. pic.twitter.com/2Oy0hBWkp4
— Olivia-Anne Cleary (@OliviaACleary) May 30, 2025
అయితే, అంతరాయానికి కారణాన్ని వివరిస్తూ.. ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్లాట్‌ఫామ్ సేవను పునరుద్ధరిస్తుందని మరియు అంతరాయానికి కారణమేమిటో స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్న యూజర్స్.. తక్షణ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. సమస్యను ఎప్పటీ లోపు సాల్వ్ చేస్తుందో తెలియాల్సి ఉంది.
. @NameisNani, the HIT machine is bringing the madness home 🥰 Watch HIT: The Third Case, now on Netflix in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#HitTheThirdCaseOnNetflix pic.twitter.com/1mqkxhqPty
— Netflix India South (@Netflix_INSouth) May 29, 2025
ఇకపోతే నెట్‌ఫ్లిక్స్లో సినిమా వస్తుందంటే..ఆ సినిమాలో ఏదో బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండేలా స్ట్రాంగ్ బెస్ మెంట్ ఏర్పాటు చేసుకుంది. తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్లు ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత.
Oru sirappana, tharamaana sambhavam paaka thayaara? 🔥
— Netflix India South (@Netflix_INSouth) May 30, 2025
Watch Retro, now on Netflix in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam. #RetroOnNetflix pic.twitter.com/bR97QvHkLT