NEP vs NED: క్రికెట్ చరిత్రలోనే థ్రిలింగ్ మ్యాచ్.. నెదర్లాండ్స్, నేపాల్ జట్ల మధ్య మూడు సూపర్ ఓవర్‌లు

NEP vs NED: క్రికెట్ చరిత్రలోనే థ్రిలింగ్ మ్యాచ్.. నెదర్లాండ్స్, నేపాల్ జట్ల మధ్య మూడు సూపర్ ఓవర్‌లు

అంతర్జాతీయ క్రికెట్ లో సోమవారం (జూన్ 16) అద్భుత మ్యాచ్ చోటు చేసుకుంది. స్కాట్లాండ్, నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠకు తలపించింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా మూడు సూపర్ ఓవర్ మ్యాచ్ లు జరగడం సంచలనంగా మారింది. గ్లాస్గో వేదికగా జరిగిన మూడు సూపర్ ఓవర్ లు జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి నెదర్లాండ్స్ విజయం సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ లో మూడు సూపర్ ఓవర్ లు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. నేపాల్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు అవసరం కాగా.. నెదర్లాండ్స్ విజయం ఖాయమనుకున్నారు. అయితే 19 ఓవర్లో 19 పరుగులు చేయడంతో పాటు 20 ఓవర్లలో 16 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరి నాలుగు బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన దశలో రెండు ఫోర్లు, రెండు డబుల్స్ రావడంతో మ్యాచ్ టై గా ముగిసింది. 

మ్యాచ్ సూపర్ తొలి సూపర్ ఓవర్ లో నేపాల్ బ్యాటర్ డోరమ్‌కి భుర్టెల్ రెండు సిక్సర్లు, ఇక ఫోర్ బాదడంతో నెదర్లాండ్స్ ముందు 20 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగు బంతుల్లో 9 పరుగులే చేసిన నెదర్లాండ్స్ చివరి రెండు బంతుల్లో మ్యాక్స్ ఓడౌడ్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టడంతో 19 పరుగులతో తొలి సూపర్ ఓవర్ టై అయింది. రెండో సూపర్ ఓవర్ లో నెదర్లాండ్స్ 17 పరుగులు చేయగా.. నేపాల్ కూడా 17 పరుగులే చేసింది. దీంతో అంపైర్ మూడో సూపర్ జరిగింది. ఈ సూపర్ ఓవర్ లో మాత్రం నెదర్లాండ్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఒక్క పరుగు కూడా చేయకుండా నేపాల్ తమ రెండు వికెట్లను కోల్పోయింది. ఒక పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్  తొలి బంతికే సిక్సర్ కొట్టి విజయం సాధించింది.