జాతీయ అవార్డ్స్లో..జై భీమ్ మూవీకి అన్యాయం..ఎందుకంటే?

 జాతీయ అవార్డ్స్లో..జై భీమ్ మూవీకి అన్యాయం..ఎందుకంటే?

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో మెగా ఫ్యామిలీ హవా నడిచింది. దాదాపు అన్ని అవార్డులు మెగా ఫామిలీ కి సంబందించిన హీరోలకు రావడం విశేషం. 2023 జాతీయ అవార్డ్స్ లో మెగాహీరో రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆరు అవార్డులను దక్కించుకుంది. లేటెస్ట్గా ఈ జాతీయ అవార్డులు ప్రకటించాక..ముఖ్యంగా ఒక సినిమాకు సంబంధించిన విషయంపై తీవ్ర చర్చలకు దారి తీసింది.

కోలీవుడ్ స్టార్ సూర్య(Suriya) హీరోగా డైరెక్టర్ TJ జ్ఞానవేల్ తెరకెక్కించిన జై భీమ్(Jai Bhim) మూవీకు ఎటువంటి క్యాటగిరిలో అవార్డు రాకపోవడంతో సినీ ఇండస్ట్రీ షాక్ లో ఉంది. సామాజిక రుగ్మతలను, పోలీసుల అన్యాయాలను, భావోద్వేగంతో కూడిన కోర్ట్‌రూమ్ డ్రామాలో వచ్చిన ఈ మూవీ ప్రశంశలు అందుకుంది. OTT లో రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన విజయాన్ని సాధించింది. 

అటువంటి జై భీమ్ మూవీ ఏ విభాగంలోనూ స్థానం సంపాదించలేదు. అవార్డుల విషయంలో..జై భీమ్ మూవీకి అన్నీ అర్హతలు ఉన్నప్పటికీ ఒక్క అవార్డు కూడా రాకపోవడం సూర్య ఫ్యాన్స్నే కాకుండా అందరినీ షాక్ అయ్యేలా చేసింది. దీంతో సూర్య ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.కొందరు కుల రాజకీయాలు చేయడం వల్లనే సూర్య జై భీమ్, స్టార్ ధనుష్ కర్ణన్ వంటి చిత్రాలకు అవార్డులు ప్రకటించలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

ఇక 70 ఏళ్ళ సినీ చరిత్రను తిరగరాస్తూ మెగా హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్  సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీలో తన అద్భుతమైన నటనకుగాను ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్స్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. హీరో సూర్యకి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఒకే విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.