
నేషనల్ క్రాష్ రష్మిక మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె తాజాగా చేసిన ఒక కమర్షియల్ యాడ్ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. దీంతో నెటిజన్స్ ఆమెను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇది మోసం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకుంది రష్మిక.
దీంతో.. ఆమె స్టార్‌డమ్ ని పలు బ్రాండ్స్ తమ ప్రమోషన్స్ కోసం వాడేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ బర్గర్ బ్రాండ్ కోసం ఒక యాడ్ చేసింది. ఈ యాడ్ లో రష్మిక.. స్పైసీ చికెన్ బర్గర్‌ని టేస్ట్ చేస్తూ కనిపించింది. ఇక ఈ యాడ్ వీడియోని రష్మిక తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యింది. అయితే.. గతంలో రష్మిక తాను ఒక శాఖాహారిని అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు చికెన్ బర్గర్ తింటూ యాడ్ చేయడంతో ఆమె పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. తమని మోసం చేయవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఈ కొత్త కాంట్రవర్సీ పై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక రష్మిక సినిమాలు విషయానికి వస్తే.. బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ హీరోగా వస్తున్న యానిమల్ అనే మూవీలో నటిస్తుంది. తెలుగులో అల్లు అర్జున్ తో పుష్ప 2, నితిన్ తో ఒక సినిమా, రైన్‌బో అనే లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తోంది.