
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. తెలుగులో తమన్ చేస్తున్న సినిమాల లిస్టు చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. అయితే వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నా.. తమన్ పై ఉన్న కాపీ ముద్ర ముద్ర పోవడంలేదు. తమన్ నుండి ఒక సాంగ్ రిలీజైంది అంటే చాలు.. దాని ఒరిజినల్ ట్యూన్ ను పట్టుకోవడానికి రెడీగా ఉంటున్నారు ట్రోలర్స్.
ఇక తాజాగా మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న "గుంటూరు కారం" సినిమాకు అదే రిపీట్ చేసాడు తమన్. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ మూవీ నుండి టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోకి తమన్ ఇచ్చిన బీజీఎం కాపీ అంటూ ఫుల్ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. గతంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని ఓ ట్యూన్‌ని బీజీఎంగా వాడేశాడని ఆరోపిస్తున్నారు.
దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆ సినిమాలో అరబిక్ స్టయిల్లో లవ్ దెబ్బ అనే ఓ సాంగ్ ఉంటుంది. అందులో దేవీ ఇచ్చిన ట్యూన్స్‌ని యాజిటీజ్ కాపీ చేసి ‘గుంటూరు కారం’కి బీజీఎంగా కొట్టేసాడని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు విజయ్ సేతుపతి, నయనతార, సమంత కాంబోలో వచ్చిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన ఒక ట్యూన్ కూడా అచ్చం ఇలానే ఉందంటూ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ వీడియోస్ చూసిన నేటిజన్స్.. తమన్ అన్నా నువ్వు ఇక మారావా అంటున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే ఏందీ తమన అన్నా ఇది అంటూ మండిపడుతున్నారు. మరి ఈ ట్రోల్స్ పై తమన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.