ఆగస్టు 16 నుంచి ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌.. రాజధాని ఏదంటూ సెటైర్లు

ఆగస్టు 16 నుంచి ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌.. రాజధాని ఏదంటూ సెటైర్లు

ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ మూడో సీజన్ కు సర్వం సిద్ధమైంది. ఆగష్టు 16 నుంచి 27 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీ పడనుండగా.. మ్యాచ్‌లన్నీ విశాఖపట్నంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో జరగనున్నాయి.

ఈ టోర్నీకి సంబంధించిన వేలం కూడా ఎంతో అట్టహాసంగా జరిగింది. వేలంలో టీమిండియా బ్యాటర్ హనుమ విహారి అత్యధికంగా రూ.6.6 లక్షల ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. రాయలసీమ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. అలాగే గోదావరి ఆటగాడు ఎం ధీరజ్ కుమార్ (రూ.5.2 లక్షలు), ఉత్తరాంధ్ర క్రికెటర్ యర్రా పృథ్వీ రాజ్ (రూ.5 లక్షలు), వైజాగ్ సెన్సేషన్ అశ్విన్ హెబ్బార్ (రూ.5 లక్షలు)లు  ఐదు లక్షల మార్కును దాటారు.

రాజధాని ఏదంటూ సెటైర్లు

సెటైర్లు వేయటానికి అభిమానులు ఈ లీగ్‌ను కూడా వాడేసుకుంటున్నారు. రాజధాని లేని రాష్ట్రంలో క్రికెట్ ఏంటంటూ నెట్టింట జోకులు పేల్చుతున్నారు. వీరి మాటల్లోనూ వాస్తవం లేకపోవదు. పొరపాటున విద్యార్థుల ప్రశ్నాపత్రంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్న ప్రశ్న ఎదురైతే.. ఏమీ రాయాలో తెలియని పరిస్థితి. 

ఏపీఎల్‌లో పాల్గొనబోయే జట్లు

  • ఉత్తరాంధ్ర లయన్స్‌
  • బెజవాడ టైగర్స్‌ 
  • కోస్టల్‌ రైడర్స్‌ 
  • రాయలసీమ కింగ్స్‌ 
  • గోదావరి టైటాన్స్‌ 
  • వైజాగ్‌ వారియర్స్‌

ఏపీఎల్ షెడ్యూల్‌

  • ఆగస్టు 16: కోస్టల్ రైడర్స్ vs బెజవాడ టైగర్స్
  • ఆగస్టు 17: వైజాగ్ వారియర్స్ vs గోదావరి టైటాన్స్
  • ఆగస్టు 17: రాయలసీమ కింగ్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్
  • ఆగస్టు 18: కోస్టల్ రైడర్స్ vs వైజాగ్ వారియర్స్
  • ఆగస్టు 18: బెజవాడ టైగర్స్ vs గోదావరి టైటాన్స్
  • ఆగస్టు 19: బెజవాడ టైగర్స్ vs రాయలసీమ కింగ్స్
  • ఆగస్టు 19: ఉత్తరాంధ్ర లయన్స్ vs కోస్టల్ రైడర్స్
  • ఆగస్టు 20: ఉత్తరాంధ్ర లయన్స్ vs వైజాగ్ వారియర్స్
  • ఆగస్టు 20: గోదావరి టైటాన్స్ vs రాయలసీమ కింగ్స్
  • ఆగస్టు 21: బెజవాడ టైగర్స్ vs ఉత్తరాంధ్ర లయన్స్
  • ఆగస్టు 21: రాయలసీమ కింగ్స్ vs వైజాగ్ వారియర్స్
  • ఆగస్టు 22: గోదావరి టైటాన్స్ vs కోస్టల్ రైడర్స్
  • ఆగస్టు 22: వైజాగ్ వారియర్స్ vs బెజవాడ టైగర్స్
  • ఆగస్టు 23: కోస్టల్ రైడర్స్ vs రాయలసీమ కింగ్స్
  • ఆగస్టు 23: ఉత్తరాంధ్ర లయన్స్ vs గోదావరి టైటాన్స్
  • ఆగస్టు 25: ఎలిమినేటర్
  • ఆగస్టు 25: క్వాలిఫైయర్ 1
  • ఆగస్టు 26: క్వాలిఫైయర్ 2
  • ఆగస్టు 27: ఫైనల్