మీ టాలెంట్ కు జోహార్లు.. అమ్మాయి అడిగిందని ఎగబడిపోయారు

మీ టాలెంట్ కు జోహార్లు.. అమ్మాయి అడిగిందని ఎగబడిపోయారు

ఏరా మామా ఏం చేస్తున్నావ్.. బయటకు వెళ్దాం వస్తావా అంటే ఫుల్ బిజీ అంటారు.. మామా ఓ వెయ్యి ఉంటే కొట్టు అంటే అబ్బే రూపాయి కూడా లేదు అని ఠక్కున చెబుతారు.. మామా షికారుకు వెళ్దామా అంటే పని ఉంది అంటూ తప్పించుకుంటారు.. అదే అమ్మాయి అడిగితే ఫ్రీగా ఉన్నా.. ఖాళీ అంటూ ఎగేసుకుని వెళతారు.. డబ్బులు కావాలంటే అప్పు చేసి పంపిస్తారు.. షికారు అంటే హుషారుగా పరిగెడతారు.. ఎంతైనా అమ్మాయి కదా.. ఇక సోషల్ మీడియాలో అయితే అమ్మాయి ఫొటో పెట్టగానే లైక్స్ తెగ వచ్చేస్తాయి.. అదే ఫ్రెండో.. మరొకడో అయితే అబ్బే ఒక్క లైక్ కూడా రాదు.. ఇలాంటి సిట్యువేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే..

ఓ అమ్మాయి చెప్పుల షాపులో సెల్ఫీ తీసుకుంది.. ఆ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఈ ఫొటో బ్యాగ్రౌండ్ మారుస్తారా అని కామెంట్ చేసింది.. ఇంకేముందీ నెటిజన్లు తమ టాలెంట్ మొత్తాన్ని చూపించారు. 80 వేల మంది రియాక్ట్ అయ్యారు.. వేల కొద్ది నెటిజన్లు తమ ప్రతిభను వీర లెవల్లో చూపించారు. చెప్పుల షాపు బ్యాగ్రౌండ్ ను తమ ఐడియాలతో మార్చేశారు.. చివరికి అమ్మాయి చాలు బాబూ బాబూ.. మీ టాలెంట్ కు జోహార్లు అనే స్థాయికి తీసుకొచ్చారు.

సోషల్ మీడియా వచ్చాక టాలెంట్ ను నిరూపించుకోవడం అంత కష్టమేం కావట్లేదు. ప్రాంతం, సందర్భంతో తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు దిగి, పలు యాప్స్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేస్కోవడం మామూలైపోయింది. అదే తరహాలో ఓ అమ్మాయికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఫొటో బ్యాగ్రౌండ్ లో ఏముంది.. ఎలా ఎడిట్ చేశారో ఇప్పుడు చూద్దాం.

 జెన్నీ అనే ఓ మహిళ ఓ చెప్పుల షాపు లో సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీలో ఆమె బ్యాగ్రౌండ్ లో అన్నీ చెప్పులే కనిపిస్తున్నాయి. ఈ ఫొటోను షేర్ చేసిన జెన్నీ.. తన సెల్పీ ఫొటోను అందంగా, తన బ్యాగ్రౌండ్ ను మార్చమని కోరుతూ ట్వీట్ చేసింది. ఈ పోస్టుకు చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. ఎంతో మంది ఆమె బ్యాగ్రౌండ్ లో లొకేషన్ ను మార్చి, అందంగా తీర్చిదిద్దారు కూడా. అందులో కొన్ని వావ్ అనిపించేలా ఉంటే.. మరికొన్ని నవ్వును తెప్పించేవిగా ఉన్నాయి.

జెన్నీ కోరిన అభ్యర్థనతో కొందరు ఆమె సెల్ఫీలో బ్యాగ్రౌండ్ ను అంతరిక్షంలాగా, బ్రిడ్జ్ పై నిలబడ్డట్టుగా, సీతాకోకచిలుక డిజైన్ ఉన్నట్టుగా ఎడిట్ చేసి పంపారు. జెన్నీ చేసిన పోస్టు వైరల్ కాగా.. దీనికి ఎవరూ ఊహించని రీతిలో 80వేల వ్యూస్ వచ్చాయి.

https://twitter.com/jagadeeshDHFM01/status/1653825951552376833

https://twitter.com/urstrulyNandhu/status/1653765295918682112

https://twitter.com/Svpdhfm1/status/1653799668235800576