ఖాళీ స్టేడియాల్లో IPL మ్యాచ్‌లు.. అభిమానులు టీవీల్లో చూస్తే చాలు

ఖాళీ స్టేడియాల్లో IPL మ్యాచ్‌లు.. అభిమానులు టీవీల్లో చూస్తే చాలు

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో క్రికెట్ కు గట్టి దెబ్బ తగులుతుండటంతో.. వరల్డ్ వైడ్ గా ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే స్టేడియాలకు ప్రజలు వెళ్లొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో.. కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ అలర్ట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. క్రికెట్ మ్యాచ్ లను చూసేందకు స్టేడియాలకు జనాలు రాకపోయినా పర్వాలేదని తెలిపాడు.

కరోనా వైరస్ సోకిన ఒక వ్యక్తి మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చినా.. అది చాలా మందికి వ్యాపిస్తుందని తెలిపాడు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు ఆడిన అనుభవం అందరికీ ఉందని..సో మ్యాచుకు పబ్లిక్ లేకపోయినా ఇబ్బందేమీ లేదన్నాడు. ఇప్పటికే IPL రద్దు చేయాలంటూ పలువురు కోర్టులో పిటిషన్ వేయగా.. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. ఇదే విషయంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. క్రికెట్ అంటే అందరికీ ఇష్టమేనని.. క్రికెటర్లు స్టేడియంలో ఆడాలని.. ప్రజలు టీవీల్లో చూస్తారంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

See Also: మండలిలో క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ అజయ్

కరోనా ఎఫెక్ట్: చికెన్‌, మటన్‌లకు ప్రత్యామ్నాయం దొరికింది

సినీ దంపతులకు కరోనా వైరస్

ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదు