
కోచింగ్ సెంటర్ల నిర్వహణకు కొత్త చట్టం తెస్తామని ఢిల్లీ మంత్రి అతిశీ వెల్లడించారు. ముసాయిదా కోసం ప్రభుత్వం, అధికారులు, విద్యార్థులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోచింగ్ సెంటర్లో మౌలిక వసతులు, టీచర్ల అర్హతలతోపాటు ఫీజులను కూడా ఈ కమిటీ సూచిస్తుందన్నారు. ఢిల్లీలోని 30 కోచింగ్ సెంటర్ల సెల్లార్లను సీజ్ చేశామని.. 200 కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ అయ్యాయని మంత్రి వెల్లడించారు.