సిటీ శివారులో నయా బిజినెస్​

V6 Velugu Posted on Nov 28, 2021

  • ప్రీ వెడ్డింగ్ నుంచి పిల్లల బర్త్​డే షూట్స్​దాకా..
  • మోడలింగ్ నుంచి కమర్షియల్ యాడ్‌‌లు కూడా.. 
  • గంటలు, రోజులకు అందుబాటులో ప్యాకేజీలు 

హైదరాబాద్, వెలుగు:  ప్రీ వెడ్డింగ్​.. మ్యారేజ్.. బర్త్​డే.. ఇలా అకేషన్​ఏదైనా షూట్ .. స్పాట్ ​ఒకేచోట. ఇండోర్​, ఔట్​డోర్​ ఎలాంటి సెటప్​ అయినా ఓకే. అకేషన్ కి తగినట్లుగా షూట్‌‌‌‌ చేసుకోవడానికి క్రియేటివ్ గా  ప్లేస్‌‌లను కొందరు అందుబాటులోకి తీసుకొచ్చారు.  ఇలా ప్లేస్ లు క్రియేట్ చేసి బిజినెస్ లు చేస్తూ కొత్త  బిజినెస్ ట్రెండ్ కు అడ్డాగా మార్చారు. అవే సిటీ శివారులోని షూట్ లోకేషన్లు. ఫొటో షూట్ల నుంచి వీడియోలు, యాడ్ లు ఏవైనా తీసుకునే విధంగా సెటప్‌‌లు, డెకరేషన్లు ఉంటాయి. సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్ల నుంచి కామన్ పీపుల్ వరకు అందరూ వస్తుంటారు. ప్లేస్ యూసేజ్ కి ప్యాకేజీలు కూడా ఉంటాయి. 

ఆల్ ఇన్ వన్ సెటప్‌‌లు
సిటీతో పాటు శివారులు నయా షూటింగ్ అడ్డాలుగా మారాయి. ఎకరం, రెండెకరాల్లో లొకేషన్లను నిర్వాహకులు రెడీ చేస్తుంటారు.  ఈ బిజినెస్ లోకి ప్రస్తుతం చాలామంది వస్తున్నారు. ముందుగా ల్యాండ్ ని లీజ్ కి తీసుకుంటారు. ఆ తర్వాత రాజ మహల్, పల్లెటూరు, విల్లాస్.. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ల్లో థీమ్ రూమ్ లను, ఇండోర్ తో పాటు ఔట్​డోర్​లో కూడా సెటప్‌‌లు ఏర్పాటు చేస్తారు.  క్లయింట్ ​రిక్వైర్​మెంట్​కు అనుగుణంగా షూట్ సామాన్లు, డెకరేషన్​ ఐటమ్స్ రెడీగా ఉంచుతారు. లొకేషన్​ ఫొటో, వీడియో, యాడ్స్ షూట్స్​గా నచ్చినట్టుగా మేకింగ్ ​చేస్తుంటారు. ప్లేస్ లని యూజ్ చేసుకునేందుకు ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉంటాయి.  గంటలు, రోజుల చొప్పున రెంట్​కు ఇస్తారు. 15వేల నుంచి స్టార్ట్​అవుతాయి. సిటీలో మాయాబజార్, ది డ్రామా ల్యాండ్, షూటింగ్ ప్లేస్, ది ఫొటో గ్యారేజ్, శంషాబాద్ షూటింగ్ హౌజ్, లిల్లీ పుట్ ల్యాండ్ .. ఇలా పదుల సంఖ్యలో షూటింగ్ ఈవెంట్స్​ ఏరియాలు ఉన్నాయి. కొంతమంది నిర్వాహకులు లొకేషన్ ని అద్దెకు ఇవ్వడంతో పాటు క్యాస్టూమ్స్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. ఇండోర్, ఔట్​ డోర్ ఏదైనా సరే క్లయింట్​ఆర్డర్​మేరకు మేకింగ్​చేసి ఇస్తారు. 

ఏ షూట్ అయినా చేసుకునేలా..
ప్రీ వెడ్డింగ్ షూట్స్ నుంచి బేబీ బార్న్ షూట్స్, బర్త్ డేస్ వరకు అన్నింటికి సూటయ్యే సెటప్‌‌లు ఈవెంట్ ఏరియాల్లో అందుబాటులో ఉంటాయి.  ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ఫొటో గ్రాఫర్ ప్యాకేజీలోనే ప్లేస్ కూడా కాంప్లిమెంటరీ కిందకి వస్తుంది.  మిగతా షూట్స్ చేసుకోవాలనుకునేవారు నేరుగా లొకేషన్ ఓనర్లను కాంటాక్ట్ అవుతుంటారు. మెటర్నరీ షూట్, హాఫ్ శారీ ఫంక్షన్, ఫస్ట్ బర్త్ డే, సాంగ్స్, యాడ్స్ , చిన్న బడ్జెట్ మూవీస్​షూట్స్ ఇలా అన్నిరకాల అకేషన్లకు సెటప్ లు రెడీ చేస్తుంటారు. ప్రస్తుతం ఫొటో షూట్స్, వీడియోలు ట్రెండింగ్ లోఉండడంతో వీళ్ల బిజినెస్ బాగానే సాగుతుంది. లొకేషన్లలో నెలకి 40, 50 షూట్ ల పైనే అవుతుంటాయి. 

సీజన్​కు తగినట్టుగా లొకేషన్స్
రెండేండ్ల కిందట శంషాబాద్ వద్ద రెండెకరాల స్థలం లీజుకి తీసుకుని మాయాబజార్​ స్టార్ట్ చేశాం. అవుట్ డోర్, ఇండోర్ థీమ్స్ తో ఏర్పాటు చేశాం. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువగా,  ఫస్ట్ బర్త్ డే, కమర్షియల్ షూట్స్ కూడా చేస్తుంటారు. మౌత్ టాక్​ద్వారానే రెస్పాన్స్ వస్తుంది. సీజన్ కి తగినట్టుగా లొకేషన్ సెటప్ లు చేస్తుంటాం.  అవుట్ డోర్ లో పూల తోటలు పెంచుతుంటాం. ప్రీ వెడ్డింగ్ సూట్స్, లాంగ్ ఫ్రాక్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. నెలలో 40 కి పైనే షూట్స్ అవుతుంటాయి. 
‑ అనూష రెడ్డి, శృతి, మాయాబజార్ ఓనర్స్​

షూట్స్ పెరిగిపోవడంతో..
సిటీ శివారులో నాలుగేండ్ల కిందట ఇండోర్ అండ్ ఔట్​డోర్ స్టూడియో స్టార్ట్ చేశాం.  ప్రస్తుతం డైలీ నాలుగైదు షూట్స్ అవుతుంటాయి. క్లయింట్ ​రిక్వైర్​ మెంట్​ను బట్టి థీమ్స్ సెట్ చేస్తుంటాం. ఫొటోగ్రాఫర్స్ కూడా  ఉంటారు. గంటల లెక్కన అద్దె తీసుకుంటాం. పది వేల నుంచి చార్జ్​ స్టార్ట్ అవుతుంది. 
‑ భాస్కర్, రాయల్ ఇండోర్ అండ్ ఔట్​డోర్ స్టూడియో 

Tagged business, BirthDay, Photo shoot, pre wedding, city outskirts, commercial adds

Latest Videos

Subscribe Now

More News