క్లాసిక్ 350 కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసినట్టు ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకటించింది. దీని చెన్నై ఎక్స్‌షోరూం రేటు రూ.1.84 లక్షల నుంచి మొదలవుతాయి. ఇందులోని 350 సీసీ ఇంజన్ 20.2 బీహెచ్‌పీని రిలీజ్ చేస్తుంది. ఇండియా, యూకేలోని తమ కంపెనీ ఇంజనీర్లు దీనిని డిజైన్ చేశారని తెలిపింది. క్లాసిక్ 350ని 2008లో లాంచ్ చేయగా, గత నెల వరకు 30 లక్షలకుపైగా బైకులు అమ్ముడయ్యాయని ఐషర్ పేర్కొంది.
