వందే భారత్ రైళ్లలో కొత్త క్లీనింగ్ సిస్టమ్

వందే భారత్ రైళ్లలో కొత్త క్లీనింగ్ సిస్టమ్

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వందే భారత్ రైళ్లు చెత్తమయం కావడంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. వెంటనే వందే భారత్ రైళ్లను క్లీన్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్లైట్స్లో అనుసరించే క్లీనింగ్ విధానాన్నే వందే భారత్ రైళ్లలో పాటించాలని సూచించారు. దీంతో రైల్వే సిబ్బంది వందే భారత్ ఎక్స్ప్రెస్లలో కొత్త క్లీనింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. కవర్ పట్టుకుని కోచ్లో నడుచుకుంటూ వెళ్తూ చెత్తను సేకరిస్తున్నారు.  ఈ మేరకు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 


కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు చెత్త మయం కావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రయాణికులు వాటర్ బాటిళ్లు, ఇతర తినే వస్తువులు కవర్లు, ప్లాస్టిక్ పేపర్లను కోచ్లలో ఎక్కడ పడితే అక్కడ వేయడంతో..కోచ్ మొత్తం చెత్త మయంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు ఈ ఫోటోలను కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ట్యాగ్ చేశారు.