నాచారం, వెలుగు: మల్లాపూర్ నాలుగో డివిజన్ అన్నపూర్ణ కాలనీలోని విఘ్నేశ్వర పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. అధ్యక్షుడిగా గోపు రాజేశ్వర్ పటేల్ మళ్లీ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పాండాల నరసింహగౌడ్(కాలనీ అధ్యక్షుడు), కోశాధికారులుగా దారుక శివకుమార్, ఎన్.చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా సి.సత్యనారాయణ, ఎం.కృష్ణారావు, కె.ప్రేమ్‌సాగర్, బి.సంజయ్ నాయక్, సంయుక్త కార్యదర్శులుగా గోపు శ్యాంసుందర్ పటేల్, డి.శశాంక్, యు.వెంకటేశ్వరరావు, ఎం.రాజమల్లు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా పాండాల శంకరయ్యగౌడ్, వి.శ్రీనివాసరావు, పి.మల్లేశ్ గౌడ్, సలహాదారులుగా బోనాల శ్రీనివాసరావు, హనుమాండ్ల భద్రయ్య, బోనాల మోహన్ రావు, కె.ఆంజనేయులు, బి.ఆంజనేయప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు. హెచ్ బీ కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు రామ్ ప్రదీప్ మునుగంటి పాల్గొన్నారు.

