iQ00 Z9 Launch: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సరికొత్త పోటీదారు.. iQ00 Z9 లాంచ్.. ఫీచర్స్ అదుర్స్

 iQ00 Z9 Launch: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సరికొత్త పోటీదారు.. iQ00 Z9 లాంచ్.. ఫీచర్స్ అదుర్స్

iQ00 తన Z సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ iQ00 Z9 ని ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7200 5G  ప్రాసెసర్ తో , సోనీ IMX 882 బ్యాక్ కెమెరా సిస్టమ్లతో అద్భుతంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ iQ00  ప్రముఖ ఈ స్టోర్ Amozon.in ద్వారా లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకోసం మార్చి 13 నుంచి ముందస్తు గా విక్రయిస్తోంది. 

iQ00Z9 స్పెషల్ ఫీచర్లు: 

  • ఈ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లతో అందుబాటులో ఉంటుంది. 
  • MediaTek Dimensity 7200 5G ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 
  • సోని IMX 882 బ్యాక్ కెమెరా అందించే మొదటి స్మార్ట్ ఫోన్. 
  • 16 MP ఫ్రంట్ కెమెరా, 2MP బోకే కెమెరా తో వస్తుంది 
  • ఇది OIS , అధునాతన AI అల్గారిథమ్ ల ద్వారా మెరుగైన పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీ  పవర్, బెస్ట్ నైట్ టైమ్ ఇమేజింగ్ ను అందిస్తుంది. 
  • ఫుటేజ్ కోసం OIS  సపోర్టుతో 4K @30fps రికార్డుతో వీడియో ఫీచర్లు ఉన్నాయి 
  • ఆప్టికల్ ఇమేజ్ స్టిబిలైజేషన్ (OIS) తో 4K వీడియో రికార్డింగ్ కు మద్దతు నిస్తుంది.
  • 120 Hz AMOLED డిస్ ప్లేతో అమర్చబడి, 1800 nits అత్యధిక బ్రైట్ నెస్ అందిస్తుంది.
  • ఈ స్మార్ట్ ఫోన్ బ్రష్డ్ గ్రీన్, గ్రాఫేన్ బ్లూ రంగుల్లో వస్తుంది 
  • డ్యూయెల్ స్టీరియో స్పీకర్లు, బోల్డ్ రియర్ కెమెరా మాడ్యూల్, బ్రష్డ్ టెక్స్ చర్డ్ డిజైన్ తో వస్తుంది.