మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ) వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్యాంకు బ్రాంచ్‌ను ఈ నెల 12న ప్రారంభించనున్నట్లు ప్యాక్స్ చైర్మన్ సంపెళ్లి నర్సింగరావు, సీఈవో అప్పం సాగర్ తెలిపారు.
ఈ బ్రాంచ్‌ను వరంగల్ ఎంపీ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా డీసీసీబీ సీఈవో వజీర్ సుల్తానా, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, డీసీఓ హల్య నాయక్ తదితరులు హాజరవుతారని తెలిపారు.
