విద్యుత్ డిస్కంలు అంటే జెన్ కో.. ట్రాన్స్ కో.. ఇప్పటి వరకు ఇవే మనకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మరో డిస్కం తీసుకొస్తుంది. ఇది మూడో డిస్కం. 2025, నవంబర్ 25వ తేదీ జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త డిస్కం పరిధిలో ఏం వస్తాయో చూద్దాం..
- కొత్తగా మూడో డిస్కం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- మిషన్ భగీరథ, మెట్రో, వాటర్ సప్లై మూడో డిస్కం పరిధిలోకి వస్తాయి
- వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్
- 3 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు నిర్ణయం
- రాబోయే పదేండ్లలో అవసరమయ్యే విద్యుత్ సరఫరాపై కేబినెట్ లో చర్చ
- పునరుత్పాదక విద్యుత్ పై చర్చించాం
- NTPC, జెన్ కో ఎవరు తక్కువ బిడ్ వేస్తే వారికే కేటాయిస్తాం
- హైదరాబాద్ ను మూడు డిస్కంల విభాగాల కిందికి తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు
- ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు
- హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ కు 14722 కోట్ల అంచనా
- మక్తల్, పాల్వంచలో కూడా థర్మల్ ప్లాంట్లు ఏర్పాటు
- ములుగులో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు
