కార్పొరేషన్​ పదవులతో కాంగ్రెస్​లో జోష్​

కార్పొరేషన్​ పదవులతో కాంగ్రెస్​లో జోష్​
  •     టీజీఐఐసీ చైర్మన్ గా నిర్మలా జగ్గారెడ్డి
  •     ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంఏ ఫయీం
  •      ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గిరిధర్ రెడ్డి
  •     మెదక్​, జహీరాబాద్ పార్టీ క్యాడర్​లో  కొత్త ఉత్సాహం

సంగారెడ్డి, వెలుగు : కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో సంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యం దక్కింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్ (టీజీఐఐసీ) చైర్మన్ గా, పటాన్ చెరుకు చెందిన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఏ ఫయీం ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా, జహీరాబాద్ కు

చెందిన గిరిధర్ రెడ్డి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. పార్లమెంట్ ఎన్నికల టైంలో మెదక్, జహీరాబాద్ సెగ్మెంట్ల పరిధిలో ముగ్గురికి కార్పొరేషన్ పదవులు రావడం కాంగ్రెస్ కు మరింత బూస్టింగ్ ఇచ్చినట్టు అయింది. దీంతో పార్టీ క్యాడర్​లో జోష్​కనిపిస్తోంది.

ఆ ముగ్గురు..

నిర్మల జగ్గారెడ్డి, ఎంఏ ఫయీం, గిరిధర్ రెడ్డిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించడంతో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. జిల్లా అధ్యక్షురాలు హోదాలో నిర్మలారెడ్డి ఇప్పటివరకు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తూ వచ్చారు. పైగా ఆమె భర్త జగ్గారెడ్డి వ్యూహాత్మక రాజకీయాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి జగ్గారెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన భార్యకు టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం పార్టీకి, జగ్గారెడ్డి అనుచరులకు మరింత బలాన్ని ఇచ్చింది.

మెదక్ సెగ్మెంట్ లోని సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో జగ్గారెడ్డి ఫేస్ వ్యాల్యూ బాగా పనిచేస్తుందని కార్యకర్తలు నమ్ముతున్నారు. అలాగే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఎంఏ.ఫయీంకు మైనార్టీ వర్గాలతో పాటు యూత్ లో ఫాలోయింగ్ బాగా ఉంది. దీన్ని క్యాచ్ చేసుకునేందుకు కాంగ్రెస్ ఆయనకు కార్పొరేషన్ పదవి ఇచ్చి మరింత ప్రోత్సహించిందని ఫయీం అనుచరులు అభిప్రాయ పడుతున్నారు. జహీరాబాద్ కు చెందిన గిరిధర్ రెడ్డి ప్రస్తుతం మండల పరిషత్ అధ్యక్షుడిగా కొనసాగుతూ నియోజకవర్గంలో

కాంగ్రెస్ ను ముందుండి నడిపిస్తున్నారు. 2018 ఎన్నికల్లో గీతారెడ్డి ఓడిపోయి నియోజకవర్గానికి దూరంగా ఉన్న టైంలో గిరిధర్ రెడ్డి కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన జహీరాబాద్, ఆందోల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో పట్టు సాధించి ప్రజాదరణ పొందడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా మారింది. మొత్తం మీద రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ రాజకీయ సమీకరణాలు చేస్తూ ఆయా స్థానాలను కైవసం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. 

కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు

జహీరాబాద్, మెదక్ లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ రెండు స్థానాల్లో బీఆర్ఎస్ ఎదురీదుతున్న క్రమంలో కాంగ్రెస్ రాజకీయ సమీకరణాలతో బిజీగా మారింది. గత ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న కారు పార్టీకి మొన్నటి వరకు ఉమ్మడి జిల్లా కంచుకోటగా నిలిచింది. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ జహీరాబాద్

మెదక్ స్థానాలు కూడా మెల్లమెల్లగా పట్టు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ లో కాంగ్రెస్ పట్టు బిగిస్తోంది. కారు పార్టీని దెబ్బతీసే ప్లాన్ లో భాగంగా కాంగ్రెస్​ముగ్గురికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టి ప్రజల్లో మరింత పాపులారిటీ పెంచుకుంది.