
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) ఢిల్లీ విభాగానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఈ ఎన్నికలు నిర్వహించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ఐజేయూ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్, కోశాధికారి యోగానంద, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుపతి నాయక్ సమక్షంలో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా నాగిళ్ల వెంకటేశ్ (సాక్షి టీవీ), ప్రధాన కార్యదర్శిగా మేకా గోపికృష్ణ (టీవీ9), ఉపాధ్యక్షులుగా వంగ తిరుపతి (వీ6 వెలుగు), పబ్బా సురేశ్, కోశాధికారిగా రాజు కొన్నోజు (ఎన్టీవీ), కార్యదర్శులుగా రాజ్ కుమార్ (సాక్షి), కామరాజు, లింగా రెడ్డి (టీ న్యూస్), నాగరాజు (వీ6), కార్యవర్గ సభ్యులుగా రాజేందర్ (ఆంధ్ర ప్రభ), సలహాదారులుగా సతీశ్ ముక్కాముల (ఏబీఎన్ టీవీ), డి. విజయ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రాజశేఖర్ రెడ్డి (సాక్షి) ఎన్నికయ్యారు.