కుంటాల మండలంలో సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుల ఎన్నిక

కుంటాల మండలంలో  సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుల ఎన్నిక

కుంటాల/ కుభీర్, వెలుగు: కుంటాల మండల సర్పంచ్​ల సంఘం కొత్త కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా కట్ట రవి, అధ్యక్షుడిగా లింగు రాంపటేల్(విట్టపూర్)ను ఎన్నుకున్నారు. 

ఉపాధ్యక్షులుగా శివాజీ (అంబుగాం), ప్రవళిక(అందకూర్), ప్రధాన కార్యదర్శిగా కె.రాజన్న(సూర్యపూర్), కార్యదర్శిగా గీత మహేందర్(లింబా కె), కోశాధికారిగా సుహాసిని (లింబా బి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని పార్టీల నాయకులు అభినందించారు.

కుభీర్​ మండల అధ్యక్షుడిగా తోకల మారుతి

కుభీర్​ మండల సర్పంచ్​ల సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తోకల మారుతి(దార్ కుభీర్), ప్రధాన కార్యదర్శిగా ఆరెపల్లి సతీశ్ (సిర్పల్లి హెచ్), ఉపాధ్యక్షులుగా మెంచు రమేశ్ (నిగ్వ), గౌరవ అధ్యక్షురాలిగా జాదవ్ సునీతాబాయి(కిసాన్ నాయక్ తండా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ.. సర్పంచుల సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు. 

అనంతరం కార్యవర్గ ఏర్పాటు పత్రాన్ని ఎంపీడీవో సాగర్ రెడ్డికి అందజేశారు. సర్పంచ్​లు మడి ప్రవీణ్, గంగామని సత్యనారాయణ, దత్తురాం పటేల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గంగా చరణ్, మాజీ ఎంపీపీ జ్యోతి, బీజేపీ మండల అధ్యక్షులు దత్తు తదితరులు పాల్గొన్నారు.