కేటీపీఎస్ లో క్రెడిట్ సొసైటీ విజేతల సంబరాలు

 కేటీపీఎస్ లో క్రెడిట్ సొసైటీ విజేతల సంబరాలు
  • నేడు కొలువు తీరనున్న కొత్త పాలకవర్గం 

పాల్వంచ,వెలుగు:భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ కేంద్రంగా గల కేటీపీఎస్, వైటీపీఎస్, బీటీపీ  ఎస్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు శుక్రవారం విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నా రు. బుధవారం ఎస్టీ, ఎస్సీ, మహిళా, బీసీ విభాగాలకు సంబంధించిన విజేతల పేర్లను ఎన్నికల అధికారులు గట్టు గంగాధర్, అవధానుల శ్రీనివాస్ లు ప్రకటించిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి తర్వాత జనరల్ కేటగిరీకి సంబంధించి ఏడు డైరెక్టర్ పోస్టులకు పోటీపడిన 20 మందిలో విజేత లుగా నిలిచిన ఏడుగురి సభ్యుల పేర్లను అధికారులు ప్రకటించారు. ఈ విభాగంలో దానం నరసింహా రావు, బుద్ధార్తి మహేందర్, డోలి శ్రీనివాసరావు, వీరమల్లు రఘు కృష్ణ, ధర్మరాజుల నాగేశ్వరరావు, సిద్ధి ప్రశాంత్, సిద్దెల హుస్సేన్ త దితర విజేతల పేర్లను  ప్రకటించారు. 

ఎన్నికల కౌంటిం గ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి న అభ్యర్థులకు తమ అనుచరులు రంగులు చల్లి, పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కాగా శనివారం నూతన పాలక వర్గం ఎన్నికల ద్వారా ప్రకటించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ప్రస్తుత కమిటీలో వల్ల మళ్ల ప్రకాశ్​రావు, కోన నాగేశ్వరరావు,  నూనావత్ కేశూలాల్ నాయక్, తోట అనిల్ కుమార్, రావు స్పందన, దాసరి వీరమణి విజేతలుగా నిలిచారు. కాగా ఎస్టీ విభాగం నుంచి విజేతగా నిలిచిన కేసులాల్ నాయక్ గిరిజన సంఘాల నాయకులు డాక్టర్ శంకర్ నాయక్, లక్ష్మణ్ నాయక్, రాజేశ్​నాయక్, రమేశ్​నాయక్, లాల్ సింగ్ నాయక్ అశోక్, ప్రవీణ్, సాయి నాయక్ లు సన్మానించారు.