హోం క్వారంటైన్​కు కొత్త గైడ్​లైన్స్

హోం క్వారంటైన్​కు కొత్త గైడ్​లైన్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: హోం క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వాళ్లు, ఇల్లంతా తిరుగుతూ తమ కుటుంబ సభ్యులకూ వైరస్ అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాసరావు ఆదివారం కొత్త గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ విడుదల చేశారు.

క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎవరుండాలి?

  • ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు, పాజిటివ్ పేషంట్లతో కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినవాళ్లు ఉండాలి. కరోనా లక్షణాలున్నా, లేకపోయినా 14 రోజులు ఎవరినీ కలవకూడదు.
  • టాయిలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న గది క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తులకు కేటాయించాలి. ఆ గదికి గాలి, వెలుతురు వచ్చేలా వెంటిలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండాలి. క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వ్యక్తి, తనకు కేటాయించిన గది దాటి బయటకు వెళ్లకూడదు. గదిలో ఎక్కువ సామాన్లు ఉండకూడదు.
  • కుటుంబ సభ్యులు కూడా అదే గదిలో ఉండాల్సి, వస్తే ఇద్దరి మధ్య ఒక మీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
  • వృద్ధులు, గర్భిణులు, పిల్లలు సహా ఇంట్లో ఎవరికైనా బీపీ, టీబీ, గుండె జబ్బులు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులుంటే వారంతా క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలి.
  • క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సబ్బు లేదా శానిటైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • చేతులు తుడుచుకోవడానికి, ఎవరికివారు ప్రత్యేక టవల్స్ వాడాలి.
  • క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వ్యక్తి వాడే వస్తువులను ఇతరులు తాకకూడదు.
  • క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వ్యక్తి కచ్చితంగా మాస్క్ ధరించాలి. ప్రతి 6 నుంచి 8 గంటలకు ఒకసారి మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చాలి.
  • వాడిన మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఇతర పారవేసే వస్తువులను కాల్చివేయాలి. లేదా లోతైన గోతిలో పాతిపెట్టాలి.
  • క్వారంటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వ్యక్తికి లక్షణాలు(దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది) కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. లేదా 104కు కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి.

రాష్ట్రంలో కేసులకు ఢిల్లీకి లింక్