
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణలో మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మార్వాడి గో బ్యాక్ జేఏసీ రాష్ట్ర కమిటీ నియామకం జరిగింది. జేఏసీ చైర్మన్ గా డాక్టర్ పిడమర్తి రవిని 11 సంఘాల నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు తెలంగాణలో షాపులు పెట్టడానికి వీలులేదన్నారు. మార్వాడీలు తెలంగాణను కల్తీమయం చేశారని, దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. దీపావళి తర్వాత రాష్ట్ర పర్యటన ఉంటుందని ప్రకటించారు. రాష్ట్ర కో-చైర్మన్ గా కరాటే శ్రీహరి, కో-ఆర్డినేటర్ గా డాక్టర్ బొమ్మెర స్టాలిన్, బోరెల్లి సురేశ్, ఉపాధ్యక్షుడిగా అందే కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సురేందర్ సన్నీ, పి.రాములు నేత, డాక్టర్ మీసాల మల్లేశ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా చాగంటి శేఖర్, సికింద్రాబాద్ అధ్యక్షుడిగా కిషన్ యాదవ్, మహబూబ్ నగర్ అధ్యక్షుడిగా బుర్ర సురేశ్, యూత్ ప్రెసిడెంట్ గా నక్క మహేశ్, మహిళ అధ్యక్షురాలిగా కోటగిరి ఉషారాణి ఎన్నికయ్యారు.