యునైటెడ్ ఫ్లైట్‌లో పాము కలకలం

యునైటెడ్ ఫ్లైట్‌లో పాము కలకలం

ఫ్లోరిడాలోని టంపా నగరం నుండి బయలుదేరిన యునైటెడ్ ఫ్లైట్ లో పాము కలకలం సృష్టించింది. న్యూజెర్సీకి బయలుదేరిన ఈ విమానంలో గార్టెర్ పాము అనే కనిపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.  అనంతరం విషయం గ్రహించిన అధికారులు నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి పామును పట్టే వాళ్లను పిలిపించి, దాన్ని అడవిలో సురక్షితంగా వదిలిపెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు వెల్లడించారు. పాము దూరిందన్న సమాచారంతో ఎయిర్ లైన్ సిబ్బంది, ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వారు జాగ్రత్తగా ఉండేలా, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన విమానం ల్యాండ్ అయిన తర్వాత జరిగినట్టు తెలుస్తోంది.

మామూలుగా ఈ రకం పాములు ఫ్లోరిడా కౌంటీలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది అంత విషపూరితమైనదేం కాదు. సాధారణంగా 18 నుండి 26 అంగుళాల పొడవుండే ఈ పాము కావాలని ఎవరైనా వెంటాడితే, లేదంటే దానికి హాని చేయాలని చూస్తేనే కాటు వేస్తుందని సమాచారం. ఈ తరహా ఘటన ఇంతకు మునుపు మలేషియాలోని ఎయిర్ ఏషియా విమానంలోనూ జరిగింది.