మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం

మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం సభ్యులు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు ఓ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లయన్ పి.బాల్ మోహన్ అధ్యక్షుడిగా, లయన్ కె.చంద్రమౌళి కార్యదర్శిగా, లయన్ వెంకటేశ్వర్లు కోశాధికారిగా, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా బాల్ మోహన్ మాట్లాడుతూ.. సభ్యుల సలహాలు, సూచనలతో వివిధ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు, రక్తదాన, కంటి శస్త్ర చికిత్స శిబిరాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో లైయన్స్ క్లబ్ సీనియర్ లయన్ మెంబర్లు వినయ్ కుమార్, డాక్టర్ సుగుణాకర్ రెడ్డి, కొత్త సురేందర్, ఎ.రాజేశ్వరరావు, సూర్యనారాయణ, డేగ బాబు తదితరులు పాల్గొన్నారు.