హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు.. ఐదు కారిడార్లలో కొత్త ప్రాజెక్టులు

హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు.. ఐదు కారిడార్లలో కొత్త ప్రాజెక్టులు

హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిటీ చుట్టూ ఐదు కారిడార్లలోనూ మెట్రో రైలు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు కారిడార్లలో మెట్రో రైలు ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి.. ఏయే ప్రాంతాలకు మెట్రో విస్తరణ చేయబోతున్నారు అనేది చూద్దాం...

  • మియాపూర్- నుంచి చందానగర్-, BHEL- మీదుగా పటాన్ చెరువు వరకు 14 కిలో మీటర్లు మెట్రో విస్తరణ.
  •  MGBS నుంచి -ఫలక్‌నుమా, -చంద్రాయణగుట్ట-, మైలార్‌దేవ్‌పల్లి- P7 రోడ్డు- మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు 23 కిలో మీటర్లు మెట్రో విస్తరణ
  •  నాగోల్ -నుంచి ఎల్‌బినగర్, -ఒవైసీ హాస్పిటల్,  - చాంద్రాయణగుట్ట,  మైలార్‌దేవ్‌పల్లి- , ఆరామ్‌గఢ్- మీదుగా  కొత్త హైకోర్టు స్థలం రాజేంద్రనగర్‌లో NH (వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం పక్కనే)  19కిలో మీటర్లు మెట్రో విస్తరణ
  •  కారిడార్- 3 పరిధిలో రాయదుర్గం స్టేషన్ నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (విప్రో సరస్సు Jn/అమెరికన్ కాన్సులేట్) వరకు బయోడైవర్సిటీ  జంక్షన్ , IIIT జంక్షన్ , ISB రోడ్ వరకు 12 కిలో మీటర్లు మెట్రో పొడిగింపు  
  • LB నగర్ నుంచి -వనస్థలిపురం మీదుగా హయత్‌నగర్ వరకు 8 కిలో మీటర్ల మేర మెట్రో విస్తరణ 
  •  శ్రీశైలం రహదారిలోశంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి కందుకూరు వరకు మెట్రో రైలు ప్రణాళికలు 
  • మెట్రో ఫేజ్-III ప్రణాళికలు JBS మెట్రో స్టేషన్ నుండి శామీర్‌పేట వరకు విస్తరణ
  •  ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ చేసేందుకు ప్లాన్ 
  • తారామతిపేట నుంచి నాగోల్, MGBS (40 కి.మీ) మీదుగా నార్సింగి వరకు మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్‌లో మెట్రో రైల్‌ ప్రణాళికలు.

అధికారులతో చర్చల అనంతరంఈ ప్రణాళికలను సమగ్ర పద్ధతిలో త్వరగా సిద్ధం చేసి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాసేందుకు రూపొందించాలని - సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.