మున్సిపాల్టీలకు కలెక్టర్లే బాసులు

మున్సిపాల్టీలకు కలెక్టర్లే బాసులు
  • సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇంటి పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • తప్పుడు సమాచారమిస్తే 25 రెట్లు ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఖాళీ జాగాలపై వెకెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (వీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ)
  • బిల్డింగులు మూడ్నెల్లకుపైగా ఖాళీగా ఉంటే సగం పన్ను మాఫీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: మున్సిపల్​ పరిపాలనలో కీలక మార్పులు వస్తున్నాయి. ఇక ముందు మున్సిపాలిటీలను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. ఇండ్ల నిర్మాణాలకు పర్మిషన్లు సులువుకానున్నాయి, ఖాళీ జాగాలు, భవనాలపై పన్నుల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘తెలంగాణ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2019’ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కొత్త చట్టంలో సంస్కరణలకు పెద్దపీట వేసిన సర్కారు.. కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించింది. కొత్త చట్టం అమలుతో పాత చట్టాలైన ‘తెలంగాణ మున్సిపల్ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1965, తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ –1994’ రెండూ రద్దయినట్లేనని పేర్కొంది. పాత చట్టం కింద గతంలో జారీ చేసిన ఉత్తర్వులు, నియామకాలు, నోటీసులు, లైసెన్సులు అమల్లో ఉంటాయని తెలిపింది.

కలెక్టర్ల కనుసన్నల్లో..

మున్సిపాలిటీల్లో పాలనను గాడిన పెట్టేందుకు, అవినీతి నిర్మూలనకు ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారుల పర్యవేక్షణ ఉండాలని భావించిన సర్కారు.. మున్సిపాలిటీల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. మున్సిపాలిటీల్లోని తీర్మానాల అమలును చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యం చేసినా, తీర్మానాలను లెక్ చేయకపోయినా సంజాయిషీ అడిగే అధికారం కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉంటుంది.మున్సిపాలిటీ రికార్డులను కూడా తెప్పించుకుని తనిఖీ చేయవచ్చు. ఆయా మున్సిపాలిటీల పరిధిలోని రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంచర్లను తనిఖీ చేసే అధికారం ఉంటుంది.

ఖాళీ భవనాలకు సగం పన్ను మాఫీ

ఏదైనా భవనం లేదా భవన సముదాయం మూడు నెలల కంటే ఎక్కువ రోజులు ఖాళీగా ఉన్నట్టయితే.. వాటికి విధించే ఆస్తిపన్నులో 50 శాతం మాఫీ చేయాలని కొత్త చట్టంలో పేర్కొన్నారు. అయితే అవి వేరొకరి కబ్జాలో ఉండకుండా, అద్దె వచ్చేవిగా కాకుంటేనే మాఫీ వర్తిస్తుంది. ఆస్తి పన్ను బకాయిలు ఉండే వ్యక్తి మాఫీ కోరడానికి అనర్హులని నిబంధన పెట్టారు.

ఆరు నెలల్లో ఖాళీ జాగాలు గుర్తించాలి

కొత్త మున్సిపల్​ చట్టం అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోగా మున్సిపాలిటీల పరిధిలోని ఖాళీ జాగాలను కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తించి, పన్ను విధించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి చెందిన భూములకు మాత్రం పన్ను మినహాయింపు ఉంటుంది. చట్టం కింద అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన పన్నుపై ఏవైనా అభ్యంతరాలుంటే కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 60 రోజుల్లోపు ఫిర్యాదు చేయవచ్చు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 30 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది.

సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తే చాలు

కొత్త చట్టంలో ఇంటి పర్మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సులభం చేశా రు. కొత్త రూల్స్‌‌ ప్రకారం.. ఇంటి నిర్మాణం కోసం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇంటి పరిమాణం, ఫ్లింత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియా, ఫ్లోర్లు, ఇతర వివరాలతో యజమాని సెల్ఫ్ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమర్పించాలి. దాన్ని బట్టే అనుమతులు మంజూరవుతాయి. కానీ ఆడిట్‌‌లో అధికారులు  తేడా గుర్తిస్తే తప్పుడు సమాచారం ఇచ్చినందుకు 25 రెట్ల వరకు ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధించే అధికారం కమిషనర్​కు ఉంటుంది. అనధికార నిర్మాణాలను కూల్చేయడం, లేదా రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం, జరిమానాతోపాటు ఆస్తిపన్ను విధించడానికి అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్​కు అధికారం ఉంటుంది. అనుమతి లేని నిర్మాణంపై 100 శాతం అదనంగా ఆస్తి పన్ను జరిమానా విధించేలా రూల్స్‌‌ పెట్టారు. ఆ ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెగ్యులరైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా భావించొద్దని స్పష్టం చేశారు. సిబ్బంది అనధికార నిర్మాణాల సమాచారాన్ని నెలనెలా రూపొందించి కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమర్పించాలి. ఆ ఆస్తులపై వెంటనే పన్ను అసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుంది.

కొత్త సేవలు ఇట్లుంటయి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మున్సిపాలిటీ చట్టం సిటిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పలు మార్పులు అమలులోకి రానున్నాయి. కొత్త చట్టం ప్రకారం చాలా సేవలు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారానే పొందవచ్చు. పలు సేవల కాలపరిమితిని కుదించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

వీటిని వెంటనే పొందవచ్చు

  • ఆస్తి పన్ను విలువ కట్టిన భవనానికి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దస్తావేజులు జతచేసి, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా వెంటనే పొందవచ్చు.
  • ఖాళీగా ఉన్న భూమి విలువ మదింపు చేయడానికి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దస్తావేజులు లేదా న్యాయస్థాన డిక్రీ లేదా ప్రమాణ పత్రం జతచేసి వెంటనే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సేవలు పొందవచ్చు.
  • వ్యాపార లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సొంత ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకుంటే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెంటనే ఇస్తారు.
  • వ్యాపార నవీకరణకు సొంత ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకుంటే ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పొందవచ్చు.
  • భవన అనుమతి ధ్రువీకరణ కాపీని వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వెంటనే డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు.
  • బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే పొందవచ్చు.

వారం వ్యవధిలో పొందే సేవలు

  • మాస్టర్​ ప్లాన్​ ప్రకారం వినియోగించిన భూమి ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో పొందవచ్చు.
  • బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిన్నారి పేరు చేర్చడానికి, పేరు సరిదిద్దుకోవడానికి దరఖాస్తు చేసిన వారంలో సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకోవచ్చు.
  • దరఖాస్తు చేసిన వారంలోగా డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొందవచ్చు. డెత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేరు సరిదిద్దుకోవడానికి సెల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దరఖాస్తు చేసుకుంటే వారంలోగా పొందవచ్చు.

వారం కంటే ఎక్కువ రోజులు

  • సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థనకు రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దస్తావేజులు లేదా న్యాయస్థాన డిక్రీ లేదా ప్రమాణపత్రం, భవన అనుమతి సంఖ్య, అఫిడవిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జత చేస్తే 15 రోజులోగా పొందవచ్చు.
  • ఖాళీలను తగ్గించడానికి పన్ను మదింపు కాపీ జత చేసి 15 రోజుల్లోగా పొందవచ్చు.
  • రివ్యూ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిక్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలతో దరఖాస్తు చేస్తే 15 రోజుల్లోతీసుకోవచ్చు.
  • నీటి పంపు అనుసంధానికి దరఖాస్తు పెడితే 14 రోజుల్లో పొందవచ్చు.