
4 కిలోవాట్‌అవర్స్ (కేడబ్ల్యూహెచ్) బ్యాటరీ కెపాసిటీతో ఎస్1 ఎక్స్ మోడల్‌ను ఓలా లాంచ్ చేసింది. ఫుల్ ఛార్జ్‌పై 190 కి.మీ వెళుతుందని కంపెనీ చెబుతోంది. ధర రూ. 1,10,000 (ఎక్స్‌షోరూమ్). ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డెలివరీస్ మొదలవుతాయి. ఈ స్కూటర్ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 80 వేల కి.మీ వరకు వారెంటీ ఇస్తున్నారు. ఎస్ 1 ఎక్స్ 4కేడబ్ల్యూహెచ్ టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీ. 3.3 సెకెన్లలోనే 0 నుంచి40 కి.మీ స్పీడ్‌ను అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. 4కేడబ్ల్యూహెచ్, 3కేడబ్ల్యూహెచ్, 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లలో ఈ బండి అందుబాటులో ఉంది.