జూన్ నుంచే కొత్త పెన్షన్లు .. సర్కారు గుడ్ న్యూస్

జూన్ నుంచే కొత్త పెన్షన్లు .. సర్కారు గుడ్ న్యూస్

రాష్ట్రంలో పెన్షన్ లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్లను వచ్చే నెల నుంచే అందించాలని నిర్ణయించింది. జూన్ నెల 2019 నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర లబ్దిదారులకు పెంచిన కొత్త  పెన్షన్లను అమలు చేయబోతున్నామంటూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర అవతరణ కానుకగా అందివ్వబోతోంది.

రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడుస్తున్నా కొత్త పెన్షన్లు అమలు కావడం లేదంటూ లబ్దిదారుల్లో కొంత నిరుత్సాహం ఉండేది. వెలుగు దినపత్రిక ఇవాళ ఈ విషయంలో ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇవాళే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం విశేషం.

కొత్త పెన్షన్లు ఇలా ఉన్నాయి

కేటగిరీ                 పాత పెన్షన్                   కొత్త పెన్షన్

వృద్ధులు               రూ.1000                   రూ.2016

వితంతువులు       రూ.1000                   రూ.2016

వికలాంగులు          రూ.1500                  రూ.3016

చేనేత కార్మికులు     రూ.1000                 రూ.2016

కల్లుగీత కార్మికులు   రూ.1000                 రూ.2016

HIV AIDS బాధితులు రూ.1000            రూ.2016

బీడీ కార్మికులు           రూ.1000             రూ.2016

ఒంటరి మహిళలు       రూ.1000               రూ.2016

ఫైలేరియా బాధితులు   రూ.1000              రూ.2016

https://epaper.v6velugu.com/2173332/V6-Prabhatha-Velugu-Telugu-Daily-Newspaper/28-05-19#page/1/1