తెలంగాణ రాష్ట్రంలో ఐదు వారాల్లోనే కొత్త పింఛన్లు!

తెలంగాణ రాష్ట్రంలో ఐదు వారాల్లోనే కొత్త పింఛన్లు!
  •     రేపటి నుంచే 'చేయూత' పోర్టల్‌‌‌‌లో దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దరఖాస్తు చేసుకున్న కేవలం ఐదు వారాల్లోనే కొత్త పింఛన్లను మంజూరు చేసేలా పక్కా కాలపరిమితితో ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. నూతన పింఛన్ల దరఖాస్తుల కోసం సోమవారం నుంచి ‘చేయూత’ వెబ్‌‌‌‌పోర్టల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 

అర్హులైన వారందరూ ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం ఐదు వారాల్లో దరఖాస్తుల స్వీకరణకు 2 వారాలు, దరఖాస్తుల పరిశీలనకు 2 వారాలు, జిల్లా, రాష్ట్ర స్థాయి ఆమోదానికి 1 వారం గడువును నిర్దేశించారు. కాగా..ఈ నెల 16న ములుగులో హ్యామ్ విధానంలో గ్రామీణ రహదారుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.