హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూనే, లీడ్ రోల్‌లో సంయుక్త నటిస్తున్న చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’. ఈ యాక్షన్ డ్రామాకు ‘చింతకాయల రవి’ ఫేమ్ యోగేష్ కేఎంసీ దర్శకుడు. రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఆదివారం వుమెన్స్ డే సందర్భంగా సంయక్త కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సంయుక్త పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపిస్తుంది. ప్రమాదకరమైన మైనింగ్ ప్రాంతం మధ్యలో నిలబడి, చేతిలో రైఫిల్ పట్టుకుని ఇంటెన్స్ లుక్ ఉన్న సంయుక్త లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. మరోవైపు పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, రవీంద్ర విజయ్, అడుకలం నరేన్, బీవీఎస్ రవి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
