ఇప్పటికే లక్ష రుణమాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వం...కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేర్వేరుగా ఇస్తామని చెప్పారు.
కరీంనగర్ బొమ్మకల్ లోని వి -కన్వెన్షన్ లో రైతు భరోసా పథకంపై ఉమ్మడి జిల్లా రైతులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం ప్రారంభించారు ఉత్తమ్ ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..గత పదేళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాకుండా పైసల కోసం కట్టారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అత్యంత ఘోరమైన తప్పిదమని చెప్పారు. 93 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరంపై గత బీఆర్ఎస్ సర్కార్ చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనన్నారు. కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు కూడా కాళేశ్వరం తీవ్ర తప్పిదమంటూ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆధారాలతో చెప్పారు.
