ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు కొత్త బాధ్యతలు

ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు కొత్త బాధ్యతలు

హైదరాబాద్ ,వెలుగు: రాష్ర్టంలో ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో చదువుతున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు కొత్త బాధ్యతలు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ర్టంలో సుమారు లక్షా50 వేల మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉన్నారని, మహిళలపై వేధింపుల నివారణ, షీ టీమ్స్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, గర్ల్స్ సమస్యలపై అవగాహన కల్పించేందకు వీరిని ఉపయోగించుకోవాలని అధికారులు   నిర్ణయించారు. వీరికి 6 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.