సింగరేణిలో అన్‌ ఫిట్టా .. ‘హోదా’ లేనట్టే

సింగరేణిలో అన్‌ ఫిట్టా .. ‘హోదా’ లేనట్టే

సింగరేణిలో కొత్త విధానంతో కార్మికుల ఇబ్బందులు ‘స్థా యి’ తగ్గింపుపై ఆగ్రహం గోదావరిఖని, వెలుగు: సింగరేణి భూగర్భ గనుల్లో 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కార్మికులు ఫిజికల్‌ ఫిట్‌ నెస్‌ కోల్పోతున్నారు. మోకాళ్లకు పట్టీలు, నడుముకు బెల్టులతో పనిచేస్తున్నారు. అయితే ఇటీవల యాజమాన్యం మెడికల్ అన్‌ ఫిట్‌ కు అవకాశమివ్వగా రెండేళ్ల సర్వీస్ మిగిలిఉన్న సుమారు రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.వీరిలో 1200 మందిని మెడికల్ ఇన్వాలిడేషన్ పద్ధతిలో అన్‌ ఫిట్‌ చేశారు. మరికొంత మందిని రివ్యూపేరుతో హైదరాబాద్‌ ఆస్పత్రికి పంపారు. అన్‌ ఫిట్‌ అయిన వారిలో సుమారు 500 మందిని భూగర్భం నుంచి భూ ఉపరితలానికి (సర్పేస్ ) మారుస్తూ ఉతర్వులు జారీ చేశారు. వీరికి గతంలో ఉన్న జీతం ఇస్తున్నా హోదా మాత్రం తగ్గించారు. హోదాలు తగ్గించ కుండా భూతలంపై ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, బొగ్గు రవాణాచేసే కోల్ హ్యాండ్ల ింగ్ ప్లాంట్ (సీహెచ్‌ పీ),
కోల్ స్ర్కీనింగ్ ప్లాంట్ (సీఎస్‌ పీ)లలో సర్దుబాటుచేసే అవకాశముంది. గతంలో కూడా ఓసీపీలు, సీఎస్పీల లో ఇలాంటి నియామకాలు జరిగాయి.మరీ హెల్పర్లుగానా..భూగర్భగనుల్లో చాలా మంది కార్మికులు ఎక్కువకాలం ఫిట్టర్లు , ఎలక్ట్రీషియన్‌ , మైనింగ్ సర్దార్, ఓవర్ మెన్, హెడ్ ఓవర్‌‌మెన్, ఎలక్ట్రికల్ సూపర్ వైజర్, మెకానికల్ సూపర్ వైజర్ తదితర కీలక పోస్టుల్లోపనిచేశారు. ఇలాంటి కార్మికులకు కిందిస్థా యి కార్మికుల్లో గుర్తింపు ఉంటుం ది. కానీ ఒక్కసారి గా ఉన్నత హోదాలో పనిచేసిన వారిని జనరల్ మజ్దూ ర్‌‌‌‌గా పిలుస్తూ సివిల్ విభాగంలో కార్పెంటర్లకు హెల్పర్లు గా డ్యూటీ లు వేస్తున్నారు. దీన్ని సీనియర్లు
జీర్ణించుకోలేకపోతున్నారు. అన్‌ ఫిట్టా .. ‘హోదా’ లేనట్టే!
‘‘ఇతను