ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ 2020లో పన్ను చెల్లింపుదారుల గురించి కీలక ప్రకటన చేశారు. ట్యాక్స్ కట్టకపోతే ఇబ్బందిపెట్టొద్దని.. పన్ను ఎగవేత క్రిమినల్ నేరం కాదని ఆమె వ్యాఖ్యనించారు. ఆ మేరకు చట్టాన్ని సవరిస్తామని ఆమె తెలిపారు. పన్నులపై వేధింపులు ఇక సహించమని ఆమె అన్నారు. పన్ను చెల్లింపుదారుల హక్కుల పరిరక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకొస్తామని ఆమె తెలిపారు.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2020-2021 సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు ఇది రెండవసారి. 2020బడ్జెట్‌పై దేశం మొత్తం భారీ అంచానాలను పెట్టుకుంది. ప్రజల ఆదాయం పెంచె దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఇది సామాన్యుల బడ్జెట్‌గా ఆమె అభివర్ణించారు.
