సింగరేణి కాలరీస్ కంపెనీలో.. కొత్తగా సత్తుపల్లి ఏరియా ఆవిర్భావం : సింగరేణి యాజమాన్యం

సింగరేణి కాలరీస్ కంపెనీలో.. కొత్తగా సత్తుపల్లి ఏరియా ఆవిర్భావం : సింగరేణి యాజమాన్యం
  •  జనరల్ మేనేజర్ గా చింతల శ్రీనివాస్ నియామకం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి కాలరీస్ కంపెనీలో మరో కొత్త ఏరియా ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటివరకు 11 ఏరియాలో ఉండగా తాజాగా సత్తుపల్లి ఏరియాలో ఏర్పాటు చేస్తూ సింగరేణి యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన సత్తుపల్లికి జనరల్ మేనేజర్ గా చింతల శ్రీనివాస్ ను యాజమాన్యం నియమించింది. చింతల శ్రీనివాస్ ఇప్పటివరకు కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా ఉన్నారు. కొత్తగూడెం ఏరియాలో భాగంగా నిన్నటి వరకు సత్తుపల్లి కొనసాగింది. 2005లో సత్తుపల్లిలో సింగరేణి ఆధ్వర్యంలో బొగ్గు తవ్వకాలు మొదలయ్యాయి. సింగరేణికే సత్తుపల్లి లోని జేవీఆర్ ఓసీ మణిహారంగా ఉంది. 

ప్రతి ఏడాది 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్ గా ఉంది. సత్తుపల్లిలో జేవీఆర్​ ఓసీతోపాటు కిష్టారం ఓపెన్ కాస్ట్​ ఉంది. సత్తుపల్లి నుంచి ఏడాదికి 14.8 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి యాజమాన్యం టార్గెట్​గా పెట్టింది. ఇప్పటివరకు కొత్తగూడెం జీఎం నుంచి సత్తుపల్లి మైన్స్ పర్యవేక్షణ కొనసాగుతుంది.

కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ గా సాలెం రాజు కొనసాగనున్నారు. కొంతకాలంగా సత్తుపల్లిని ఏరియా చేయాలని యాజమాన్యం ప్లాన్ చేసినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. కాగా, సత్తుపల్లి నుంచి పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి జరుగుతుండడం ట్రాన్స్​పోర్ట్ అవుతుండడంతో కొత్తగూడెం నుంచి పర్యవేక్షణ ఇబ్బందిగా ఉన్న క్రమంలోని యాజమాన్యం ప్రత్యేకంగా జీఎంను నియమించినట్లుగా సీనియర్లు పేర్కొంటున్నారు.