మూడు రంగాలకు త్వరలో కొత్త స్కీమ్

మూడు రంగాలకు త్వరలో కొత్త స్కీమ్

న్యూఢిల్లీ: టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌, ఆటో, స్టీల్ సెక్టార్లలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా  వీటి గ్లోబల్ సప్లై చెయిన్‌‌‌‌లో భాగం కావాలని మనదేశం కోరుకుంటోంది. ఈ మూడు రంగాల్లో లోకల్ తయారీని పెంచడానికి  ప్రొడక్షన్ -లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని త్వరలోనే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై డిపార్ట్​మెంట్​ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) అదనపు కార్యదర్శి సుమితా దావ్రా మాట్లాడుతూ, తయారీని ఎంకరేజ్ చేయడానికి  అధునాతన టెక్నాలజీలను ఆకర్షించడానికి,  క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం ప్రొడక్షన్ పెంచడానికి కేంద్రం పీఎల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు.

ఆటో కాంపొనెంట్స్, స్టీల్  టెక్స్‌‌‌‌టైల్స్‌‌‌‌ సెక్టార్ల కోసం త్వరలోనే పీఎల్ఐ పథకాన్ని ప్రకటిస్తామని  పీహెచ్‌‌‌‌డీసీసీఐ వెబ్‌‌‌‌నార్‌‌‌‌లో గురువారం ఆమె వెల్లడించారు.   ప్రస్తుత మహమ్మారి కారణంగా.. బహుళజాతి కంపెనీలు తమ సరఫరా చెయిన్లను కొన్ని దేశాల్లో మాత్రమే కేంద్రీకరించడం వల్ల ఏర్పడే సమస్యలను గ్రహించాయని, అవి మనలాంటి దేశాలపై ఫోకస్‌‌‌‌ చేస్తాయని చెప్పారు. ఈ మూడు రంగాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారతదేశం గ్లోబల్ సరఫరా చెయిన్‌‌‌‌లో భాగం కావడానికి ప్రయత్నిస్తోందని దావ్రా చెప్పారు. రాబోయే  ఐదేళ్ల కాలంలో మొత్తం రూ .2 లక్షల కోట్ల విలువైన పీఎల్ఐ స్కీమ్ ను 13 రంగాలకు వర్తింపజేసే ప్రపోజల్ కు కేంద్ర  ప్రభుత్వం గత ఏడాది ఆమోదం తెలిపింది. వెబ్‌‌‌‌ నార్‌‌‌‌లో పీహెచ్డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పీఎల్ఐ పథకం సహాయపడుతుందని అన్నారు. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు కుంతల్ శర్మ మాట్లాడుతూ, ఈ రంగం డెవెలప్ కావడానికి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పీఎల్ఐ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ బిజినెస్ మరింత పెరుగుతుందని అన్నారు.