
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవల తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు వీటిలో ‘కాంత’ కూడా ఒకటి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. 1950ల నాటి మద్రాస్, అప్పటి సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్నాడు.
టీజర్, ఫస్ట్ సింగిల్‌తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన మేకర్స్... బుధవారం (అక్టోబర్ 22) ‘అమ్మడివే’ అనే పాటను విడుదల చేశారు. వింటేజ్ ఆర్కెస్ట్రేషన్‌తో ఉన్న ఈ పాటను ఝాను చంథర్ కంపోజ్ చేయగా ప్రదీప్ కుమార్ పాడాడు. ‘‘తారలకే జో పలికే జాబిలివే తెలుసా నీకే.. అమ్మడివే నా చెలివే.. నిశిలా నలుపై నేనే ఉంటే శశివై ఇలకే నువ్వు వచ్చేశావే..” అంటూ కృష్ణకాంత్ లిరిక్స్ రాశారు.
దుల్కర్, భాగ్యశ్రీ జంటపై చిత్రీకరించిన ఈ వింటేజ్ సాంగ్ క్లాసిక్ రొమాన్స్ లవర్స్‌ను ఆకట్టుకునేలా సాగింది. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.