
బాల్కొండ, వెలుగు : బాల్కొండ ఎస్సైగా కె.శైలేందర్, మెండోరా ఎస్సైగా జాదవ్ సుహాసిని ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాల్కొండ ఎస్సైగా పని చేసిన నరేశ్ఆదిలాబాద్ కు, మెండోరా ఎస్సై యాసిర్ అరాఫత్ వేకెన్సీ రిజర్వ్ డ్ కు బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సైలు శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.
సదాశివనగర్ లో..
సదాశివనగర్, వెలుగు : సదాశివనగర్ ఎస్సైగా పుష్పరాజ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఎస్సై రంజిత్ దేవునిపల్లి పీఎస్ కు బదిలి అయ్యారు. మండల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని ఎస్సై పేర్కొన్నారు.
ఎడపల్లి లో..
ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి ఎస్సైగా ముత్యాల రమ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా పని చేసిన వంశీ కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై రమ తెలిపారు.