వేములవాడకి కొత్తగా సబ్ రిజిస్టర్ ఆఫీస్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వేములవాడకి కొత్తగా సబ్ రిజిస్టర్ ఆఫీస్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సిరిసిల్ల: వేములవాడకి కొత్తగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం (మే 16) సిరిసిల్లలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి చట్టం నలుగురి మధ్యలో నలుగురి కోసం మాత్రమే తయారు చేశారని.. భూ భారతి మాత్రం పేదల చట్టమని అన్నారు. 

ALSO READ | వేములవాడ రాజన్న ఆలయం చుట్టూ రాజకీయం.. ఆలయ విస్తరణ పనులపై రాజకీయ దుమారం

తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మన భూ భారతి చట్టం మోడల్‎గా తీసుకునే విధంగా ఉంటుందన్నారు. ధరణి చట్టంతో అనాడు పేద ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ప్రతి భూ సమస్యను పరిష్కారమే విధంగా భూ భారతి చట్టం రూపొందించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 283 సర్వేయర్‎లు ఉన్నారు. కొత్తగా 6 వేల మంది సర్వేయర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 953 రెవెన్యూ గ్రామాల్లో వీఆర్ఎస్, వీఆర్వోలు ఉండే వారని.. బీఆర్ఎస్ వల్ల వాళ్లంతా రోడ్ల పాలయ్యారని విమర్శించారు.

ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తున్నామని చెప్పారు. అనాడు భూ సమస్య వస్తే కోర్టుకి వెళ్లాల్సి ఉండేదని.. కానీ ఇప్పుడు మన దగ్గరే సమస్య పరిష్కారం చేసుకోవచ్చని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 1500 అప్లికేషలు వచ్చాయని.. అవి జూన్ 2 వరకు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయన్నారు. 

మీ సమస్యలు చెబితే రెవెన్యూ అధికారులు మీ దగ్గరికే వస్తారని.. ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం జరుగుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు జాగ్రత్తగా ఉండాలని.. రైతులను ఇబ్బంది పెట్టవద్దు, మీరు కూడా రైతు బిడ్డలేనని అన్నారు. ఏ అధికారి అయినా రైతులను ఇబ్బంది పెడితే వారిపై చర్యలు తీసుకునే విధంగా చట్టం ఉందని గుర్తు చేశారు.