వరంగల్, వెలుగు: టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా గడ్డం కేశవమూర్తి, ఊటుకూరి సీతారామారావు ఎన్నికయ్యారు. యూనియన్ నేతలు ఆదివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు కోశాధికారిగా పొడిశెట్టి విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులుగా దండు మోహన్, ఇమ్మడి ప్రసాద్, గునిశెట్టి విజయభాస్కర్, అల్లె రామారావు, సహక్ష్ కార్యదర్శులుగా జి.బాలరాజు, గన్ను సంతోష్ కుమార్, బోయిని భిక్షపతి, ఎండీ ఖాదర్ పాష, కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి కంకణాల సంతోష్ తెలిపారు.
