
హైదరాబాద్: పంజాగుట్టలోని ప్రజాభవన్ వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన కేసులో మరో పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు షకీల్ కొడుకు సాహిల్ ను తప్పించేందుకు ప్రయత్నించారని బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు మద్యం మత్తులో ప్రగతిభవన్ వద్ద బారీకేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత షకీల్ కొడుకు సాహిల్ దుబాయ్ కి పారిపోయాడు. దుబాయ్ వెళ్లేందుకు సీఐ ప్రేమ్ కుమార్ సహకరించినట్లు ఆరోపణలు న్నాయి. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెన్షన్ వేటు వేసి అరెస్ట్ చేశారు.