 
                                    కరీంనగర్: కాలువలో పడి జలసమాధి అయిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబం కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. గత నెల ఫిబ్రవరి 17న తిమ్మాపూర్ మండలం అలుగునూర్ వద్ద కాకతీయ కాలువలో కారుతో సహా పడి చనిపోయిన సత్యనారాయణ రెడ్డి, అతని భార్య, కూతురు మృతిపై కొత్త కోణం బయటకు వచ్చింది. ఈ కారు ప్రమాదం ఆత్మహత్య అన్నట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ లోని సత్యనారాయణకు చెందిన ఫెర్టిలైజర్ షాపులో పోలీసులకు ఓ డైరీ దొరికినట్లు తెలిసింది. ఆ డైరీలో తన ఆస్తి అంతా టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం)కి అప్పగించాలని సత్యనారాయణ రాసుకున్నారు. దీంతో ఇది ఖచ్చితంగా ఆత్మహత్యేనని పోలీసులు భావిస్తున్నారు. డైరీలో ఉన్న చేతిరాతను ధ్రువీకరించు కునేందుకు ఆ డైరీని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు సమాచారం.

 
         
                     
                     
                    