పాన్ - ఆధార్ లింక్లో కొత్త అప్‌డేట్.. మీరూ చెక్ చేసుకోండి

పాన్ - ఆధార్ లింక్లో కొత్త అప్‌డేట్.. మీరూ చెక్ చేసుకోండి

జూన్ 2023 చివరి నాటికల్లా పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే, ఇప్పుడు పాన్ కార్డు- ఆధార్ కార్డు లింక్ లో కొత్త అప్ డేట్ వచ్చింది. ఇన్ కం టాక్స్ చట్టంలోని సెక్షన్ 139AA ప్రకారం.. పాన్ కార్డు ఉన్న వాళ్లు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాలి.

ఇప్పటికే చాలామంది దీన్ని అప్ డేట్ చేసి ఉంటారు. అలాంటి వాళ్లు ఓసారి స్టేటస్ చెక్ చేసుకుని పాన్-ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోండి. 

పాన్-ఆధార్ లింక్ ఎలా లింక్ చేయాలో ఇక్కడ చూడవచ్చు:

  • మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అందులో హోమ్ పోజీలో ఉండే.. క్విక్ లింక్స్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకుని పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • పేమెంట్ కోసం ఆప్షన్ ఎంచుకున్న తర్వాత.. ఈ-పే ట్యాక్స్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఈ పేజ్ లో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత... ఇన్‌కమ్ ట్యాక్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసి, అదర్ రిసిప్ట్స్ (500) ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి.
  • పేమెంట్ చేసిన తర్వాత చలాన్ జనరేట్ అవుతుంది. పేమెంట్ చేసిన 4 లేదా 5 రోజుల తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయాలి.