కొత్త రకం తేజ మిర్చి.. క్వింటా రూ. 15 వేలకు అమ్మిన రైతు !

కొత్త రకం తేజ మిర్చి.. క్వింటా రూ. 15 వేలకు అమ్మిన రైతు !

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు బుధవారం కొత్త రకం తేజ మిర్చి వచ్చింది.  జిల్లాలోని కామేపల్లి మండలం బర్లగూడెంకు చెందిన రైతు బానోతు రవి కొత్తరకం తేజ మిర్చి పండించారు. ఆరు బస్తాల మిర్చిని అమ్మకానికి కమీషన్ ఏజెంట్ గడ్డం లక్ష్మీ నారాయణ వద్దకు తెచ్చాడు.

క్వింటా రూ.15,039 పలికింది. తాలు మిర్చి క్వింటా రూ.8,118 ధర వచ్చింది. కొత్తరకం తేజ మిర్చి మార్కెట్ కు రావడంతో ముందుగా కొబ్బరికాయ కొట్టి కొనుగోలు ప్రారంభించారు. మార్కెట్ అసిస్టెంట్ సెక్రెటరీ వీరాంజనేయులు, కమీషన్ వ్యాపారులు, రైతులు ఉన్నారు.