కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ పాత బస్ స్టాండ్‌ను కూల్చివేసి, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త బస్ స్టాండ్‌ను రూ.75 కోట్లతో నిర్మాణం చేస్తున్నట్లు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వరంగల్ సిటీలోని బస్ స్టాండ్ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్నిర్మాణ పనులు స్పీడప్గా జరుగుతున్నాయన్నారు. పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ పాటించాలని ఇంజినీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయనవెంట కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు తదితరులున్నారు.
