వాట్సాప్ లో కొత్త ఫీచర్స్

వాట్సాప్ లో కొత్త ఫీచర్స్

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఆకట్టుకొనే వాట్సాప్​ ఈ సారి కూడా వెనక్కి తగ్గలేదు. వాట్సాప్​ స్టిక్కర్లు, సెక్యూరిటీ ఫీచర్లను అప్​డేట్​ చేసింది. వాయిస్​ నోట్స్​ కోసం మెరుగైన ఫీచర్లను తీసుకురానుంది. వాట్సాప్ వాయిస్ మెసేజ్ నోట్స్‌‌ను కంట్రోల్​ చేయడానికి వీలైన ఫీచర్​ టెస్టింగ్​ దశలో ఉంది. దీని ద్వారా యూజర్లు ఆడియో మెసేజ్​ను ప్లే చేసేటప్పుడు స్పీడ్​ను కంట్రోల్​ చేయొచ్చు. అలాగే  వాయిస్ నోట్​ను ఫార్వార్డ్ చేసినప్పుడు విని పంపేందుకు సాధ్యం కాదు. కానీ త్వరలోనే వాయిస్​ నోట్​ ను విని పంపే ఫీచర్​ రానుంది. అలాగే ఇబ్బందికరమైన మెసేజ్​లను రిపోర్ట్​ చేయడం, నెంబర్లను బ్లాక్​ చేసేటప్పుడు రిపోర్ట్​ చేయడం కోసం ఫీచర్​ను అప్​డేట్​ చేసింది. 

వాట్సాప్​లోనే  స్టిక్కర్స్​ 
ఇప్పటి వరకు వాట్సాప్​ స్టిక్కర్స్​ను ఇతర యాప్​లు వాడి తయారు చేయాల్సి వచ్చేది. వాటిని స్టిక్కర్​ ఫీచర్​ ద్వారా పంపుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఇన్​స్టంట్​గా స్టిక్కర్స్​​ తయారు చేసుకోవచ్చు. డైరెక్ట్​ వాట్సాప్​లోనే ఈ ఫీచర్​ యాడ్​ అయింది. వాట్సాప్​ అటాచ్​మెంట్​ టూల్​లో ఈ ఫీచర్​ కనిపిస్తుంది. అక్కడ స్టిక్కర్​ అనే ఆప్షన్​ నొక్కాలి. దాన్ని ప్రెస్ చేసి, ఏ బొమ్మను అయితే స్టిక్కర్​గా మార్చాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్​ చేసుకోవాలి. అది వాట్సాప్​లోకి వస్తుంది. ఈ ఇమేజ్​ను క్రాప్​, ఎడిట్​, కట్​, పెయింట్​ టూల్స్​ ద్వారా వాట్సాప్​లోనే ఎడిట్​ చేసుకోవచ్చు. కావాల్సిన స్టిక్కర్​ రెడీ అయ్యాక.. సెండ్​ బటన్ నొక్కడమే.
ట్రూ కాలర్  
ట్రూ కాలర్​ యాప్​ తెలియని వారుండరు. స్ట్రేంజ్​​ నెంబర్లను చెక్​ చేయడానికి ఈ యాప్​ను వాడుతుంటారు. అయితే దీంట్లో ఫ్రీ, ప్రీమియం ఫెసిలిటీస్​ ఉండేవి. ఇప్పటివరకూ ప్రీమియం యూజర్లకు మాత్రమే అవైలబుల్​గా ఉన్న ఫీచర్లు ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. వాటితో పాటు కొన్ని కొత్త ఫీచర్లను కూడా ట్రూకాలర్​ యాడ్​ చేసింది.

కాలర్​ వీడియో
ఇంతకు ముందు వరకు యూజర్​ పేరు, ఈ–మెయిల్​ అడ్రస్​ మాత్రమే ​ రికార్డ్​ చేసేది ట్రూ కాలర్. కానీ ఇప్పుడు యూజర్​ తన వీడియోను కూడా ముందే రికార్డ్​ చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా ఫోన్​ చేసినప్పుడు పేరుతో పాటు వీడియో కూడా అవతలి వాళ్లకు కనిపిస్తుందన్నమాట. అందుకోసం యూజర్​ తన వీడియోను ముందే రికార్డు చేసుకోవచ్చు. 

అనౌన్స్​ 
కాల్​ అనౌన్స్​ అనే ఫీచర్​ ద్వారా ఫోన్​ చేసిన వాళ్ల పేరు, వివరాలను చదివి వినిపిస్తుంది. అంటే ఫోన్​ స్క్రీన్​ చూడకుండానే ఎవరు కాల్​ చేశారో తెలుసుకోవచ్చు. 

కాల్​ రికార్డర్​
ట్రూ కాలర్​లో కాల్​ రికార్డింగ్​ ఫీచర్​ ఉన్నప్పటికీ అది గతంలో ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు అది ఫీచర్​ అయింది. అంటే అందరికీ ఈ ఫీచర్​ వాడుకునే అవకాశం ఉందన్నమాట. దీంతో పాటు.. ట్రూ కాలర్​ వాడుతున్న వారు మెసేజులు, కాల్స్​ ఒకే ట్యాబ్​ నుంచి చేసుకోవడానికి వీలుండేది. కానీ కొత్త ఫీచర్​ ద్వారా ఇప్పుడు సెపరేట్​గా కాల్​ 
చేసుకునే వీలుంది. కాల్​ లిస్ట్​, మెసేజ్​ల లిస్ట్​ వేరువేరు ట్యాబ్స్​లో రికార్డ్​ అవుతాయి. 

ఘోస్ట్‌‌ కాల్‌‌ 
ఈ కాల్​ కొంత విచిత్రమైంది. దీన్ని ఉపయోగించి ఘోస్ట్​ కాల్స్​ చేయొచ్చు. ప్రాంక్‌‌ కాల్స్‌‌ చేయడానికి దీన్ని వాడొచ్చు. ఫోన్​ చేసినప్పుడు ఫోన్​ చేసిన వాళ్ల వివరాలు కాకుండా ఇతరుల పేరు, నెంబర్‌‌ లేదా ఫొటో కనిపించేలా మార్పులు చేయొచ్చు. ఈ ఫీచర్‌‌ ను కేవలం ప్రీమియం, గోల్డ్‌‌ సబ్‌‌ స్క్రైబర్స్‌‌కు మాత్రమే ఉపయోగించే ఛాన్స్​ ఉంది. 

గూగుల్​ క్రోమ్​ డార్క్​ మోడ్​ 
ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లలో డార్క్​ మోడ్​ ఫీచర్​కు విపరీతమైన స్పందన వచ్చిన తర్వాత చాలా ఫ్లాట్​ఫామ్స్​ కూడా డార్క్​మోడ్​కు ఇంపార్టెన్స్​ ఇస్తున్నాయి. ఫోన్లు, డెస్క్​టాప్స్​లోనే కాదు గూగుల్​ క్రోమ్​లో కూడా డార్క్​ మోడ్​ ఫీచర్​  అవసరం అవుతుంది. అందుకు కొన్ని అప్​డేటెడ్​​ బ్రౌజర్లలో సెట్టింగ్స్​లోకి వెళ్లి పర్సనలైజేషన్​లో ​ థీమ్స్​ ఆప్షన్​ సెలక్ట్​ చేసుకొని డార్క్​ థీమ్​ 
సెట్​ చేసుకోవచ్చు. కానీ, కొన్ని క్రోమ్​ బ్రౌజర్లలో ఈ థీమ్​ ఫీచర్​ లేదు. అలాంటి వాటిలో ‘ డార్క్​ థీమ్​ ఎక్స్​టెన్షన్​’ బాగా పని చేస్తుంది. ఎక్స్​టెన్షన్​లోకి వెళ్లి డార్క్​ థీమ్​ అని సెర్చ్​ 
చేస్తే చాలు. బోలెడు రకాల డార్క్​ థీమ్స్​ వస్తాయి. వాటిలో ప్యూర్​ బ్లాక్​, మెటల్​ బ్లాక్​, గ్లాసీ ఇలా చాలా రకాలు ఉన్నాయి. వాటిని అప్లయ్​ చేసుకుంటే చాలు డార్క్​ మోడ్​ గూగుల్​ క్రోమ్​ను ఎంజాయ్​ చేయొచ్చు.