ఒకే పేరున్న 178 మందితో మీటింగ్.. గిన్నిస్ రికార్డు

ఒకే పేరున్న 178 మందితో మీటింగ్.. గిన్నిస్ రికార్డు

ఒకే పేరు ఉన్న వారి గురించి వినే ఉంటాం. అలాగే ఇంటి పేరు కూడా ఒకటే ఉండే వారు చాలా అరుదు. అయితే ఒకే ఇంటి పేరు.. ఒకే పేరు ఉన్న మనుషులందర్ని ఓ ప్రదేశంలోకి చేర్చి జపాన్ రాజధాని టోక్యో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. టోక్యోకు చెందిన కార్పొరేట్ ఉద్యోగి హిరోకాజు తనకా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హిరోకాజు తనకా అనే పేరు ఉన్న 178 మంది ఈ సమావేశానికి హాజరై ప్రపంచ రికార్డును సృష్టించారు. అంతకుముందు 2005లో యూఎస్ లో మార్తా స్టీవర్ట్స్ అనే పేరు ఉన్న 164 మంది ఒకే చోట చేరి రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును వీరు బ్రేక్ చేశారు. 

టోక్యోలో సమావేశమైన హిరోకాజు తనకాలలో  మూడేళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. వీరందరూ వృత్తి పరంగా వేరువేరుగా ఉన్నారు.  కాగా, అసోసియేషన్ ప్రతినిధి 53 ఏళ్ల హిరోకాజు తనకా మాట్లాడుతూ.. తాము మూడో ప్రయత్నంలో విజయం సాధించామన్నారు. గతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా 2011లో 71 మంది, 2017లో 87 మంది వచ్చారని చెప్పారు. 

అసోసియేషన్ ప్రతినిధి తనకా 1994లో అదే పేరు ఉన్న వ్యక్తుల కోసం సంస్థను స్థాపించారు. జపాన్ ప్రో బేస్‌బాల్ జట్టు ఒసాకా కింటెట్సూ బఫేలోస్‌గా పిలిచే జపాన్ ప్రో బేస్‌బాల్ జట్టుకు ఎంపికైన మొదటి తనకా ఇతడు. ప్రస్తుతం ఈ మాజీ ఆటగాడు పిఛర్ అనే మారుపేరుతో ఉన్న సమూహంలో సభ్యుడిగా ఉన్నారు. సభ్యులందరికీ ఒకే పేరు ఉండటం చాలా విచిత్రమైన అనుభూతని, ఈ సంఘటన తనను లోతుగా కదిలించిందని అన్నారు. ఇదిలా ఉంటే.. వీరంతా ఒకే చోట చేరి సరికొత్త రికార్డు సృష్టించారని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత ప్రకటించడంతో వేదిక చప్పట్లతో మార్మోగిపోయింది.